AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్‌ఆర్‌ఐ మీట్‌ అండ్‌ గ్రీట్‌, యూఎస్‌లో స్థిరపడిన తెలుగువారందరికీ ఉపయుక్తమన్న వక్తలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన ప్రవాసాంధ్రులు మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని..

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్‌ఆర్‌ఐ మీట్‌ అండ్‌ గ్రీట్‌, యూఎస్‌లో స్థిరపడిన తెలుగువారందరికీ ఉపయుక్తమన్న వక్తలు
Venkata Narayana
|

Updated on: Feb 26, 2021 | 10:45 PM

Share

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన ప్రవాసాంధ్రులు మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలిఫోర్నియాలోని ప్లీజన్‌టన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇంఛార్జ్‌ డాక్టర్‌ టీవీ.నాగేంద్రప్రసాద్‌, యూఎస్‌లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఐటీ సలహాదారు రాజేశ్‌రెడ్డి, APNRTS ఛైర్మన్‌ వెంకట్‌ మాడపాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రొవిజినల్‌ కో ఆర్డినేటర్‌గా ఇటీవల నియమితులై..కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న వారందరినీ…YSRCP, తెలుగువారు కలిసి పలువురిని ఘనంగా సత్కరించారు. ఏపీ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు ఇచ్చే పెట్టుబడి అవకాశాలు, ప్రోత్సకాలను ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సలహాదారు రాజేశ్‌రెడ్డి కార్యక్రమానికి హాజరైన వారికి వివరించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ , పారిశ్రామిక, పెట్టుబడి రంగాలలో ఉన్న అవకాశాలను అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలిపారు.

అమెరికాలో తెలుగువారి వికాసం కోసం అనేక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామని ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ఛైర్మన్‌ వెంకట్‌ మాడపాటి చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో దేవాలయాల దర్శనం, ఇతర న్యాయ, ఇమ్మిగ్రేషన్‌ సలహాలు, సూచనలు, కుటుంబ ఆరోగ్యబీమా, ప్రయాణ మార్గదర్శకాలు లాంటి అనేక కార్యక్రమాల్లో APNRTS సహాయం చేస్తుందని తెలిపారు.

భారత ప్రభుత్వం నుండి పెట్టుబడి అవకాశాలు, ప్రోత్సహకాలను కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కౌన్సిలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇంఛార్జ్‌ డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ వివరించారు. వీసా, పాస్‌పోర్టు, OCI, కాన్సులేట్‌ సర్వీసులు వంటి విషయాలపై ప్రవాసాంధ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు ప్రవాసాంధ్రులు.

కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న ప్రముఖ NRI కేవి రెడ్డి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో APNRT కో-ఆర్డినేటర్లుగా అబ్బవరం సురేంద్రరెడ్డి, కిరణ్‌ కూచిబొట్ల, సుబ్రహ్మణ్యంరెడ్డి, నరసింహయాదవ్‌, సహదేవ్‌ నియమించారు. ఈ సందర్భంగా APNRTS సేవలను ప్రవాసాంధ్రులకు ఎలా అందిస్తారో వివరించారు.

Read also : తమిళనాడులో మరో ముగ్గురిని మింగేసిన జల్లికట్టు, 15 మందికి తీవ్ర గాయాలు, పలువురి పరిస్థితి సీరియస్‌