AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2 లక్షల 60 వేల జరిమానా.. అవాక్కయిన బాధితుడు..

కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా ఓ వ్యక్తికి రూ.2 లక్షల 60 వేల జరిమానా విధించింది తైవాన్ దేశ ప్రభుత్వం.

క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2 లక్షల 60 వేల జరిమానా.. అవాక్కయిన బాధితుడు..
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 12:01 AM

Share

కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా ఓ వ్యక్తికి రూ.2 లక్షల 60 వేల జరిమానా విధించింది తైవాన్ దేశ ప్రభుత్వం. మరి అంతగా కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నారు ఆ దేశ అధికారులు. లాక్‌డౌన్ విధించలేదు కానీ క్వారంటైన్ నిబంధనలు, కరోనా టెస్ట్‌లను ఎప్పటికప్పుడు చేపడుతూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

అయితే పిలిప్ఫిన్స్ నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడికి ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. కరోనాకు గురైనందున తైవాన్ ప్రభుత్వం ఆ కార్మికుడికి 14 రోజుల క్వారంటైన్ విధించింది. కావోసింగ్‌లోని హోటల్ గదిని అతడికి కేటాయించింది. అయితే పక్కగదిలో ఉన్న ఓ వ్యక్తిని కలిసేందుకు అతడు ఎనిమిది సెకన్లు బయటికి వచ్చాడు. ఆ ద‌ృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో గమనించిన అధికారులు గది నుంచి ఎందుకు బయటికి వచ్చావని అతడిని ప్రశ్నించారు. అతడు చెప్పే సమాధానం కూడా వినకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు 3500 డాలర్ల ( అక్షరాల రూ.2 లక్షల 60 వేలు) జరిమానా విధించారు. ఇంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు కనుకే ఆ దేశంలో కేవలం 700 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంతేకాదు 8 నెలలుగా ఒక్క కేసు కూడా లేదు. అయితే నిబంధనలు బాగానే అమలు చేస్తున్నా బాధితులకు ఇంత ఫైన్ వేయడం దారుణం అంటున్నారు ఆ దేశానికి వచ్చే విదేశీయులు.