భారత సంతతి వ్యక్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫౌండేషన్ చీఫ్ పదవి, జనవరి 1 న బాధ్యతల స్వీకరణ
భారత సంతతి వ్యక్తి, గ్లోబల్ హెల్త్ ఎక్స్ పర్ట్ కూడా అయిన అనిల్ సోనీని కొత్తగా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫౌండేషన్ చీఫ్ గా నియమించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో బాటే ఈ సంస్థ కూడా ప్రపంచ వ్యాప్తంగా గల ఆరోగ్యపరమైన సవాళ్ళను..
భారత సంతతి వ్యక్తి, గ్లోబల్ హెల్త్ ఎక్స్ పర్ట్ కూడా అయిన అనిల్ సోనీని కొత్తగా ఏర్పాటు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫౌండేషన్ చీఫ్ గా నియమించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో బాటే ఈ సంస్థ కూడా ప్రపంచ వ్యాప్తంగా గల ఆరోగ్యపరమైన సవాళ్ళను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. జనవరి 1 న సోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు తగినట్టు ఈ ఫౌండేషన్ కూడా కృషి చేయనుంది. జెనీవాలో దీన్ని ఓ స్వతంత్ర సంస్థగా గత మే నెలలో ఏర్పాటు చేశారు. అనిల్ సోనీ లోగడ గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ అయిన వయాట్రిస్ లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ హెడ్ గా వ్యవహరించారు. ఈయనను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ టెడ్రోస్..’ప్రూవెన్ ఇన్నొవేటర్’ గా అభివర్ణించారు.
తన నియామకంపై స్పందించిన అనిల్ సోనీ..ఆరోగ్య పరమైన విషయాల్లో ప్రపంచం క్లిష్ట దశలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళను తాము పరిష్కరించాల్సి ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలనన్న విశ్వాసం తనకు ఉందన్నారు. గతంలో ఈయన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కి సీనియర్ సలహాదారుగా కూడా పని చేశారు.