Social media: అర్ధరాత్రి నిలిచిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు.. మీమ్స్‌తో చెలరేగిన యూజర్లు..

ఇటీవల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ట్విట్టర్‌ సేవల్లో తరచూ అంతరాయ ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అర్ధరాత్రి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి

Social media: అర్ధరాత్రి నిలిచిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు.. మీమ్స్‌తో చెలరేగిన యూజర్లు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2021 | 2:16 PM

ఇటీవల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ట్విట్టర్‌ సేవల్లో తరచూ అంతరాయ ఏర్పడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అర్ధరాత్రి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో నెటిజన్లు మరోసారి కోపోద్రిక్తులయ్యారు. ఫేస్‌బుక్‌కు చెందిన సామాజిక మాధ్యమాలను వదిలేస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక గత నెల అక్టోబర్‌లో కూడా ఇలాగే రెండుసార్లు సోషల్‌ మీడియా ఖాతాల సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో భారత్‌తో పాటు యూఎస్‌, యూకే దేశాల్లో ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ఎఫ్‌ బీ మెసేంజర్‌ సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా యూజర్లు #facebookdown, #instagramdown హ్యాష్‌ట్యాగ్‌లతో ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో మీమ్స్ షేర్‌ చేశారు. దీనిపై స్పందించిన ఫేస్‌బుక్‌ యాజమాన్యం మెసేజింగ్‌ యాప్స్‌ పనిచేయడం లేదని నిర్ధారించింది. సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అని మెసేజ్‌ చేశారు. ఆ తర్వాత మరోసారి తెల్లవారుజాము 4.34 గంటల ప్రాంతంలో బగ్‌ను గుర్తించామని, సమస్యను పరిష్కరించామంటూ సందేశం పంపారు.

Also read:

Afghan Crisis: అఫ్గాన్‌లో దారుణం.. 9 ఏళ్ల కూతురిని 55 ఏళ్ల ముసలాడికి అమ్మేసిన తండ్రి..

China Market: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై

Alphabets Name: కొడుక్కి ABCDEFGHIJK జుజు అని పేరు పెట్టాడు..! ఎందుకో తెలుసా..?(వీడియో)