AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xi Jinping: వీడని సస్పెన్స్.. జిన్‌పింగ్‌ను గద్దె దింపారా..? లేక క్వారైంటెన్‌లో ఉన్నారా..? ఏది నిజం..

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ విషయంలో ఇంకా పుకార్లు షికార్లు చేయడం తప్ప ఎలాంటి స్పష్టతా రాలేదు.. సోషల్‌ మీడియాలో రకరకాల వదంతులు వినిపిస్తున్నా, వీటిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు చైనా ప్రభుత్వం..

Xi Jinping: వీడని సస్పెన్స్.. జిన్‌పింగ్‌ను గద్దె దింపారా..? లేక క్వారైంటెన్‌లో ఉన్నారా..? ఏది నిజం..
Xi Jinping
Shaik Madar Saheb
|

Updated on: Sep 26, 2022 | 5:54 AM

Share

China President Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ విషయంలో ఇంకా పుకార్లు షికార్లు చేయడం తప్ప ఎలాంటి స్పష్టతా రాలేదు.. సోషల్‌ మీడియాలో రకరకాల వదంతులు వినిపిస్తున్నా, వీటిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు చైనా ప్రభుత్వం.. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగిన SCO సమ్మిట్‌ నుంచి తిరిగి వచ్చిన జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ చీఫ్‌ బాధ్యతలనుంచి తప్పించానే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రులకు మరణ శిక్ష వేయడంతో జిన్‌పింగ్‌ మీద తిరుగుబాటు జరిగిందని అంటున్నారు.. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షునిగా సీనియర్‌ సైనికాధికారి లీకిమావో మింగ్‌ బాధ్యతలు చేపట్టారని చెబుతున్నారు.. నిజంగానే లీకిమావో మింగ్‌ కొత్త అధ్యక్ష పదవి చేపట్టి ఉంటే అధికారికంగా ప్రకటించేవారు.. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వెనుక మిస్టరీ ఏమిటి అన్నది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మిస్టరీపై చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ, మీడియా అధికారులు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఉత్కఠ రేపుతోంది. కాగా జిన్‌పింగ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని మరో వదంతి ప్రచారంలోకి వచ్చింది. చైనాలో అమల్లో ఉన్న కొవిడ్‌ నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కొద్ది రోజులు క్వారంటైన్‌కు వెళ్లాలనే నిబంధన ఉంది. అందుకే అయన విశ్రాంతి తీసుకుంటున్నారని భావిస్తున్నారు.

మరోవైపు జిన్‌పిన్‌ తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.. వచ్చే నెల జరిగే సీపీసీ సమావేశాల్లో ఆయన మూడోసారి పదవిని చేపట్టేందుకు అనుకూలంగా సభ్యుల మద్దతు పొందనున్నారని తెలుస్తోంది. మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసే చారిత్రాత్మకంగా మూడోసారి అధికారాన్ని పొందేందుకు జిన్‌పింగ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చైనా కమ్యునిస్ట్ పార్టీ 20వ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు అక్టోబర్ 16న ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..