Watch Video: ప్రిన్సిపల్‌ తిట్టాడని నాటు తుపాకీతో వచ్చిన విద్యార్థి.. ఆ తర్వాత మాటువేసి.. షాకింగ్‌ వీడియో

కొంతమంది విద్యార్థుల ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. ఇటీవల జార్ఖండ్‌లో తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను విద్యార్థులు చెట్టుకు కట్టి కొట్టిన విషయం తెలిసిందే.

Watch Video: ప్రిన్సిపల్‌ తిట్టాడని నాటు తుపాకీతో వచ్చిన విద్యార్థి.. ఆ తర్వాత మాటువేసి.. షాకింగ్‌ వీడియో
Crime News
Follow us

|

Updated on: Sep 25, 2022 | 5:53 AM

Student Shoots Teacher: కొంతమంది విద్యార్థుల ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. ఇటీవల జార్ఖండ్‌లో తక్కువ మార్కులు వేశారన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడిని, క్లర్క్‌ను విద్యార్థులు చెట్టుకు కట్టి కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరవకముందే ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను మందలించాడన్న కారణంతో ప్రిన్సిపల్‌పై ఓ విద్యార్థి ఏకంగా నాటు తుపాకీతో కాల్పులకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar pradesh) లోని సీతాపుర్‌లోని ఆదర్శ్ ఇంటర్ కాలేజీలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సీతాపుర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదర్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ కళాశాలలో శుక్రవారం ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇది ప్రిన్సిపల్‌ దృష్టికి వెళ్లడంతో ప్రిన్సిపాల్ రామ్ స్వరూప్ వర్మ జోక్యం చేసుకుని ఇద్దరు విద్యార్థులను మందలించారు.

దీంతో.. కోపంతో రగిలిపోయిన ఓ విద్యార్థి గుర్వీందర్ సింగ్ శనివారం నాటు తుపాకీతో కళాశాలకు వచ్చాడు. అనంతరం కోపంతో ప్రిన్సిపల్‌పై మూడు రౌండ్లపాటు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ప్రిన్సిపల్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రమాదమేమి లేదని ఏఎస్పీ రాజీవ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను లక్నో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా, ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విద్యార్థి చేతిలో తుపాకీ పట్టుకొని ఉపాధ్యాయుడిని వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది. విద్యార్థి పిస్టల్‌తో దాడి చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించడం రికార్డయింది. అతన్ని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయినప్పటికీ వారికి తుపాకీ గురిపెట్టి అక్కడినుంచి పారిపోయాడు. మందలించినందుకు విద్యార్థి ఇంతకు తెగిస్తాడనుకోలేదని ప్రిన్సిపాల్‌ తెలిపాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..