Italy Election: ఇటలీలో గెలుపెవరిది..? ముగిసిన పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌.. ఆమెకే అవకాశం..!

Italy Election 2022: ఇటలీలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు ఓటేశారు. ప్రధానమంత్రి పదవికి మారియో ద్రాగి అర్ధంతరంగా రాజీనామా చేయడంతో ఇటలీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

Italy Election: ఇటలీలో గెలుపెవరిది..? ముగిసిన పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌.. ఆమెకే అవకాశం..!
Italy Election 2022
Follow us

|

Updated on: Sep 26, 2022 | 6:15 AM

Italy Election 2022: ఇటలీలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు ఓటేశారు. ప్రధానమంత్రి పదవికి మారియో ద్రాగి అర్ధంతరంగా రాజీనామా చేయడంతో ఇటలీ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు ఓటేశారు. ఇటలీ చరిత్రలో తొలిసారిగా 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించినా, యువ ఓటర్ల సందడి పెద్దగా కనిపించలేంటున్నారు. ఈ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ, ఫోర్జా ఇటాలియా, లెగా సెంటర్‌ రైట్‌, డెమొక్రాటిక్‌ పార్టీ, ఫైవ్‌ స్టార్‌ మూవ్‌మెంట్‌, థర్డ్‌పోల్‌, ఇటాలియన్‌ లెఫ్ట్‌, ఇటాలెగ్జిట్‌ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. ప్రధానమంత్రి పదవికి మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, జార్జియా మెలోని, ఎన్రికో లెట్టా, మాంటియా సాల్విని, గుయ్‌సేఫ్‌ కాంటే ప్రధానంగా పోటీ పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో నియోఫాసిస్ట్ మూలాలు ఉన్న బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి అత్యధిక సీట్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇదే వాస్తవమైతే ఇటలీ చరిత్రలో తొలిసారిగా మహిళ ప్రధాని బాధ్యతలను చేపట్టబోతున్నారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నాయకురాలు జార్జియా మెలోని ప్రచారంతో ప్రధాన ఆకర్శణగా నిలిచారు. రెండు వారాల క్రితం నిర్వహించిన చివరి ఒపీనియన్ పోల్‌లో మెలోని నేతృత్వంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. అంతేకాకుండా జార్జియా తనదైన శైలితో అందర్ని ఆకట్టుకుందని పలువురు పేర్కొంటున్నారు.

కాగా, 2018లో జరిగిన ఎన్నికలలో మెలోని పార్టీ కేవలం 4% ఓట్లను మాత్రమే గెలుచుకున్నా, మూడేళ్ల కాలంలోనే అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తామని భావిస్తున్నారు.. కాగా అక్టోబర్ 13 వరకు కొత్త పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లోపు తదుపరి ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో