డ్యూటీ టైమ్‌లో ఎక్కువ సార్లు స్మోక్‌ బ్రేక్‌ తీసుకున్న ఉద్యోగికి రూ.9 లక్షల జరిమానా.. ఎక్కడో తెలుసా?

డ్యూటీ టైమ్‌లో ఎక్కువ సార్లు విరామం తీసుకున్నందుకుగానూ..కంపెనీ ఉత్పాదకత తగ్గిందని కంపెనీ చెప్పింది. అంతే కాదు ఒక ఉద్యోగి చేసిన 14 ఏళ్ల పని పూర్తిగా బ్రేక్‌లో పోతుంది. అందుకోసం..

డ్యూటీ టైమ్‌లో ఎక్కువ సార్లు స్మోక్‌ బ్రేక్‌ తీసుకున్న ఉద్యోగికి రూ.9 లక్షల జరిమానా.. ఎక్కడో తెలుసా?
Smoke
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 31, 2023 | 10:07 PM

ఐటీ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులు పని ఒత్తిడి, బాధ్యత, నిర్వహణ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. డ్యూటీ సమయంలో ఉద్యోగులు చిన్న చిన్న విరామాలు తీసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా ఒత్తిడి మధ్య విశ్రాంతి తీసుకోవడానికి, అలవాటు ఉన్నవారు ఒక దమ్ము పీల్చటానికి వెళ్తుంటారు. అయితే, అలాంటిదే.. ఇక్కడ ఒక ఉద్యోగి ఆఫీస్‌ వేళలో తరచుగా విరామం తీసుకునేవాడట.. అయితే ఏడాది చివర్లో ఆ ఉద్యోగికి జీతం పెరగటానికి బదులు కంపెనీ ఊహించని షాక్ తగిలింది. డ్యూటీ టైమ్‌లో ఎక్కువ సమయం విరామం తీసుకున్నందుకు గానూ..ఆ ఉద్యోగికి రూ.9 లక్షల జరిమానా విధించారు. అంతే కాదు 6 నెలలు జీతంలో 10 శాతం కోత విధించారు.

61 ఏళ్ల ఉద్యోగి తన 14 ఏళ్ల సర్వీసులో 4,500 సార్లు డ్యూటీ టైమ్‌లో బ్రేక్ తీసుకున్నాడు. రోజూ చాలాసార్లు బ్రేక్‌ తీసుకుని బయటకు వెళ్తుండే వాడు. అలా బ్రేక్‌ టైమ్స్‌ మొత్తం కౌంట్‌ చేయగా… 14 ఏళ్ల కాలంలో 4,500 స్మోక్ బ్రేక్‌లలో 3,400 అనధికారమైనవిగా గుర్తించారు. అయితే, కంపెనీ ప్రతిరోజూ కొంత బ్రేక్ టైమ్‌ని కేటాయిస్తుంది. కానీ సదరు ఉద్యోగి నిర్దేశించిన విరామం కంటే ఎక్కువ బ్రేక్ తీసుకున్నట్లు తెలిసింది.

డ్యూటీ టైమ్‌లో ఎక్కువ సార్లు విరామం తీసుకున్నందుకుగానూ..కంపెనీ ఉత్పాదకత తగ్గిందని కంపెనీ చెప్పింది. అంతే కాదు ఒక ఉద్యోగి చేసిన 14 ఏళ్ల పని పూర్తిగా బ్రేక్‌లో పోతుంది. అందుకోసం రూ.9 లక్షల జరిమానా విధించారు. వచ్చే 6 నెలలకు జీతం 10% తగ్గించారు. అంతే కాదు మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే, ఈ సంఘటన జరిగింది మాత్రం జపాన్‌లో అని తెలిసింది.

ఇవి కూడా చదవండి

సిగరెట్ తాగడానికి పని మధ్య విరామం తీసుకోవడం కొత్తేమీ కాదు. అయితే కంపెనీ ఉద్యోగి ఎన్నిసార్లు విరామం తీసుకున్నాడు. సరైన కారణంతో ఎన్నిసార్లు తీసుకున్నాడో ఈ విషయంలో తేలిపోయింది. ఈ ఘటన తర్వాత జపాన్ ప్రైవేట్ కంపెనీల్లో స్మోక్ బ్రేక్ లు తీసుకోవడం, అనవసర కారణాలతో బ్రేక్ తీసుకోవడం తగ్గిందని జపాన్ మీడియా పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..