Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత
జపాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకున్నట్లు ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

Earthquake
జపాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. జపాన్ రాజధాని టోక్యోకు ఆగ్నేయం వైపున 107 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకున్నట్లు ఆ దేశానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అలాగే ఈ భూకంపం దాటికి భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతువరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ఇవాళ మధ్యాహ్నం 3.33 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం వచ్చిన అనంతరం ఎలాంటి సునామి హెచ్చరికలు కూడా జారీ చేయలేదని తెలిపింది. అయితే ఈ భూకంప ప్రభావం వల్ల ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగిందా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి

Pawan Kalyan: రహస్య చర్చలతో జనసేనాని బిజీ బిజీ.. పవన్‌తో చర్చిస్తున్నదెవరు..? ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..

Hyderabad: పార్ట్‌టైం జాబ్‌గా ర్యాపిడో నడుపుతున్నారా.? మీకో గుడ్ న్యూస్.. ఇకపై డబ్బే డబ్బు.!

Bandi Sanjay: తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్.. కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ లీడర్ బండి సంజయ్..

Amaravathi Site Pattas: ‘ఇది అందరి అమరావతి’.. పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్..