Earthquake: వారం తర్వాత మళ్లీ ఇండోనేషియాలో భూకంపం.. ఆందోళనలో స్థానికులు
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున మలుకు ప్రావిన్స్‌లో తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున మలుకు ప్రావిన్స్‌లో తనింబర్ దీవుల్లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 70.2 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. తనింబార్ దీవులకు తైమూర్ లౌట్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ దాదాపు 65 కంటే ఎక్కువగా ద్వీపాలు ఉన్నాయి. ఏప్రిల్ 3న పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్ర ఐలాండ్ లో 6.1 రిక్టార్ స్కేల్ తీవ్రతతో భూకంపం వచ్చింది. వారంలోనే తాజాగా ఇప్పుడు భూకంపం రావడం కలకలం రేపుతోంది.
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అగ్నిపర్వాతాలకు నిలయమైన ద్వీపాల సమూహం ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెల అక్కడ భూకంపం రావడం సాధారణం అయిపోయింది. మళ్లీ ఎప్పుడు ఏ చోట భూకంపం వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..భూకంపం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.