CM KCR: ఈ దేశం మనది.. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలి.. ఇఫ్తార్ విందులో సీఎం కీలక వ్యాఖ్యలు..
అభివృద్దిలో తెలంగాణ ముందుకెళ్తుంటే ..దేశం వెనక్కి వెళ్తోందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్‌తో పాటు మంత్రులు , మజ్లిస్ ఎంపీ ఒవైసీ హాజరయ్యారు. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు కేసీఆర్. మైనారిటీల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు కేసీఆర్.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దశాబ్దాలుగా వెనక్కి తీసుకెళ్లిందని.. దేశాన్ని కాపాడేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని.. ఐక్యత- సమగ్రత విషయంలో రాజీపడబోనని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విమర్శించారు. బుధవారం ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సరైన నాయకుడు, సరైన పార్టీ నాయకత్వం కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు. దేశం క్లిష్ట సమయంలో నడుస్తోందని, ప్రతి ఒక్కరూ సంఘటితమై పరిష్కారాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతీ ఏడు లాగే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరందరి రాకతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000 నుంచి 1050 యూనిట్లు ఉండేది. నేడది రెండింతలు పెరిగి 2100 యూనిట్లకు చేరుకున్నది. దేశంలోనే మనం అత్యున్నత స్థానంలో నిలిచాం. పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసి తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా ను అత్యద్భుతంగా నిర్మించుకున్నారు సీఎం కేసీఆర్.
మనం అభివృద్ధి చెందుతున్నంతగా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నాం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఘనస్వాగతం లభించింది. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధి నమూనాను బిజెపి అనుసరించి ఉంటే మన జిడిపి ఇప్పుడున్న దానికంటే 3 నుండి 4 లక్షల కోట్లు ఎక్కువగా ఉండేదని ఆయన అన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను జాబితా చేస్తూ, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.08 లక్షలకు చేరుకుందని, తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లకు చేరిందని, వరి సాగు 56.40 లక్షల ఎకరాలకు చేరుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. తాగునీరు, విద్యుత్‌లో స్వయం సమృద్ధి సాధించామని, త్వరలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల కాంగ్రెస్ హయాంలో మైనారిటీ సంక్షేమానికి రూ.1180 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అయితే తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.12వేలకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు.
లైవ్ వీడియోను ఇక్కడ చూడండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం