Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: బీబీసీ జర్నలిస్టు ట్విట్టర్ గురించి అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ దిమ్మ తిరిగే సమాధానం

తనదైన శైలీలో ట్వీట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఎలాన్ మాస్క్. తాజాగా ఆయన్ని ఓ బీబీసీ జర్నలిస్టు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మస్క్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Elon Musk: బీబీసీ జర్నలిస్టు ట్విట్టర్ గురించి అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ దిమ్మ తిరిగే సమాధానం
Elon Musk
Follow us
Aravind B

|

Updated on: Apr 13, 2023 | 11:44 AM

తనదైన శైలీలో ట్వీట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఎలాన్ మాస్క్. తాజాగా ఆయన్ని ఓ బీబీసీ జర్నలిస్టు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మస్క్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ఎలాన్ మస్క్‌ని ఇంటర్వ్యూలో ట్విట్టర్ అంశంపై ఆ విలేకరి ప్రశ్న అడిగారు. ట్విట్టర్‌లో విద్వేష ప్రసంగాలు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ ట్విట్టర్ లో వస్తున్న విద్వేష ప్రసంగాలు ఏంటో కొన్ని ఉదాహరణలు చెప్పండని అన్నారు. అయితే ఆ విలేకరీ సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో మీరు అబద్ధం చెప్పారని ఎలాన్ మస్క్ అతనికి బదులిచ్చారు.

ఇటీవల ట్వీట్టర్ బీబీసీని ప్రభుత్వ నిధుల మీడియాగా అభివర్ణించింది. దీనిపై స్పందించిన బీబీసి లైసెన్స్ ఫీజు ద్వారా తమది ఎప్పటికీ స్వతంత్ర సంస్థేనని.. లైసెన్స్ ఫీజుల ద్వారా బ్రిటీష్ ప్రజలే నిధులు ఇస్తున్నారంటూ బదులిచ్చింది. అలాగే భారత్‌లో ప్రధాని మోదీపై బీబీసీ చేసిన డాక్యూమెంటరీని నిషేధించిన వ్యవహారంపై కూడా ఎలాన్ మస్క్ ఈ మధ్య స్పందించారు. తనకు ఈ విషయం పట్ల అవగాహన లేదని.. భారత్‌లో మాత్రం సోషల్ మీడియాపై నిబంధనలు కఠినంగా ఉంటాయని.. వాటిని దాటి వెళ్లలేమని తెలిపారు. తమకు జైలుకు వెళ్లాలా లేక నిబంధనలకు కట్టుబడి ఉండాలా అనే అవకాశం వస్తే..నిబంధనలకు కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గతంలో ప్రధాని మోదీపై చేసిన బీబీసీ డ్యాకుమెంటరీ లింకులు ట్విట్టర్‌లో షేర్ అవ్వగా.. 50 కి పైగా ఆ ట్విట్టర్ లింకులు తొలగించాలని భారత్ ట్విట్టర్‌ను కోరిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.