దుబాయ్‌లో స్మగ్లర్ కొత్త ఎత్తుగడ..కండోమ్స్‌లో కొకైన్

పెరూ దేశానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో […]

దుబాయ్‌లో స్మగ్లర్ కొత్త ఎత్తుగడ..కండోమ్స్‌లో కొకైన్
Follow us

|

Updated on: Apr 17, 2019 | 9:12 AM

పెరూ దేశానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తి ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… పెరూ నుంచి ఈజిప్టుకు వెళుతున్న నిందితుడు ఫ్లైట్ మార్పిడిలో భాగంగా దుబాయ్ ఎయిర్ పోర్టులో దిగాడు. అయితే అతని బ్యాగేజీని పరిశీలించగా పెద్ద మొత్తంలో కండోమ్ ప్యాకెట్స్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. అయితే ఇన్ని కండోమ్ ప్యాకెట్స్ బ్యాగేజ్‌లో ఎందుకున్నాయనే అనుమానంతో వాటిని విప్పి చూశారు. ఇంకేముందు ఆ కండోమ్స్‌లో తెల్లటి పొడి పదార్థం బయటపడింది. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయి… నార్కోటిక్స్ టీమ్‌కు తెలియజేయగా ఆ తెల్లటి పొడి పదార్థం కొకైన్ అని తేల్చారు. నిందితుడి బ్యాగు నుంచి వెలికి తీసిన 80 కండోమ్స్‌లో ఏకంగా 2.3 కేజీల కొకైన్ బయట పడగా మొత్తం సీజ్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అయితే ఇటీవలి కాలంలో దుబాయ్ కేంద్రంగా డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా బంగారం, డ్రగ్స్, వజ్రాలు, ఆయుధాలను పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తుండటంతో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీంతో అలర్టైన యూఎఈ అధికారులు ఎలాగైన స్మగ్లింగ్ ముఠాల ఆగడాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు, కఠినమైన చట్టాలతో శిక్షలు కూడా వేస్తున్నారు. అయితే ఎన్ని చేసినప్పటికీ స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులు వెతుకుతుండటం గమనార్హం.