Donald Trump: నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే.. వివరాలు ఇవిగో
మొదటి రోజే పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సంకేతాలిచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం చేసుకుని.. సంతకాలకు సై అంటున్నారు. వచ్చీరాగానే ట్రంప్ తీసుకొబోయే సంచలన నిర్ణయాలు ఏమై ఉంటాయి..? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తొలి రోజే వందకుపైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తారు. మొదటి రోజే రికార్డు స్థాయిలో అధికారిక ఉత్తర్వులపై సంతకం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రంప్ విక్టరీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు ఎలాన్ మస్క్. తన కొడుకుతో కలిసి ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ట్రంప్ ఆహ్వానించడంతో వేదికను పంచుకున్నారు. అమెరికా సైన్యానికి ట్రంప్ గొప్ప కిక్ ఇచ్చారు. ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ని అమెరికాలోనే తయారు చేస్తామన్నారు.
నాలుగేళ్ల అమెరికా పతనావస్థకు చరమగీతం పాడబోతున్నామన్నారు ట్రంప్. విఫలమైన, అవినీతిమయమైన పాలనకు ముగింపు పలికామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు పోప్. వాటికన్ సిటీ నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వంతో కలిసి నడుస్తామంటోంది జపాన్ సర్కార్. ట్రంప్ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని ఆకాంక్షించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ వాషింగ్టన్ డీసీలో భారీగా జనం రోడ్ల మీదకు వచ్చారు. సంబరాలకు సిద్ధమయ్యారు ట్రంప్ అభిమానులు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పాలన రావడంతో అమెరికా- మెక్సికో సరిహద్దులో వలసలు తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ రాకతో వలసదారులు బోర్డర్ దాటాలంటేనే భయపడిపోతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి