Donald Trump Visit: ట్రంప్ 3 గంటల పర్యటనకు.. ఖర్చెంతో తెలుసా..!
Donald Trump Visit: ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ ఏర్పాటు చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం. ట్రంప్ ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే. అందుకోసం విజయ్ రూపానీ సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను అందించనుంది. మోటేరా స్టేడియం ప్రారంభించిన తర్వాత ఎయిర్ పోర్టుకు […]
Donald Trump Visit: ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ ఏర్పాటు చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం. ట్రంప్ ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే. అందుకోసం విజయ్ రూపానీ సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను అందించనుంది.
మోటేరా స్టేడియం ప్రారంభించిన తర్వాత ఎయిర్ పోర్టుకు ట్రంప్ తిరిగి వెళ్లే మార్గంలో 1.5 కిలోమీటర్ల రోడ్డు పొడవునా కొత్త రోడ్లను వేయిస్తున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. వీటి కోసం రూ. 80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రత కోసమే రూ. 15 కోట్ల దాకా ఖర్చుచేయనున్నారు. మోదీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా రూ. 4 కోట్లు వెచ్చిస్తున్నారు. ట్రంప్-మోదీ హాజరయ్యే రోడ్ షో కోసం 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.