AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా షిప్’ నుంచి అమెరికన్ల తరలింపు ?

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది […]

'కరోనా షిప్' నుంచి అమెరికన్ల తరలింపు ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 16, 2020 | 5:55 PM

Share

జపాన్ లోని యోకోహామా రేవులో నిలిచి ఉన్న  నౌక నుంచి 428 మంది అమెరికన్లను తరలించేందుకు రెండు విమానాలు వాషింగ్టన్ నుంచి సోమవారం బయలుదేరనున్నాయి. డైమండ్ ప్రిన్సెస్  అనే ఈ నౌకలో 3,700 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గత 10 రోజులుగా ‘బందీలు’గా ఉండిపోయారు. వీరిలో 285 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో ఇతర ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. (గత మూడు రోజుల్లోనే 67 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు). 78 మంది బ్రిటిషర్లు తమను కూడా  ఈ నౌక నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని తమ దేశ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వీరిలో  ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్టు తెలిసింది. ఇద్దరు వృధ్ద బ్రిటిష్ దంపతులు మమ్మల్ని  వెంటనే ఈ నౌక నుంచి తరలించేందుకు విమానాన్ని పంపవలసిందిగా బిలియనీర్ రిచర్డ్ బ్రాన్ సన్ ను కోరడం విశేషం. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేమని వీరు దీనంగా వేడుకుంటున్నారు.

ఈ షిప్ లో 138 మంది భారతీయులు ఉండగా.. వీరిలో ముగ్గురికి ఈ వ్యాధికి సంబంధించిన పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నట్టు తెలిసింది. అయితే వారు క్రమేపీ కోలుకుంటున్నారని జపాన్ లోని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.  ఈ నెల 19 న వీరిని ఇండియాకు తీసుకువచ్ఛే ఏర్పాట్లు చేయవచ్చు. కాగా-చైనాలో కరోనా మృతుల సంఖ్య 1523 కి చేరింది.

Follow Us
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
సిట్రోయెన్ నుంచి బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్.. ఫీచర్లు ఇవే
సిట్రోయెన్ నుంచి బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్.. ఫీచర్లు ఇవే
సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో అసలైన మొనగాడు ఎవరు..?
సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో అసలైన మొనగాడు ఎవరు..?
విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా
విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా