Brazil: కరోనా మహామ్మరితో బ్రెజిల్ లో గర్భిణీల మరణాలు ఎక్కువ అవుతున్నాయి..వైద్యనిపుణుల నివేదిక!

తాను గర్భవతి అని తెలిసిన కొన్నిరోజుల్లోనే బ్రెజిల్ కు చెందిన 23 ఏళ్ల లెటెసియా అపెరెసిడా గోమ్స్ ఒక ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయింది. ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది.

  • KVD Varma
  • Publish Date - 11:52 am, Tue, 4 May 21
Brazil: కరోనా మహామ్మరితో బ్రెజిల్ లో గర్భిణీల మరణాలు ఎక్కువ అవుతున్నాయి..వైద్యనిపుణుల నివేదిక!
Pregnant With Corona Positive

Brazil: తాను గర్భవతి అని తెలిసిన కొన్నిరోజుల్లోనే బ్రెజిల్ కు చెందిన 23 ఏళ్ల లెటెసియా అపెరెసిడా గోమ్స్ ఒక ఇబ్బందికర పరిస్థితిలో పడిపోయింది. ఒంట్లో నలతగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోకు తూర్పు వైపుగా ఓ గంట ప్రయాణం దూరంలోని మారికోలో ఆమె నర్సింగ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నా మొదటి ప్రెగ్నెన్సీ. నా మొదటి పాపాయిని చూసుకోవాలనే తపన ఉంది. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించి ఆసుపత్రిలో చేరిపోయాను అని చెప్పింది. ఆమె పట్ల అదృష్టం ఉంది. గోమ్స్ వారం రోజులు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందిన తరువాత క్షేమంగా ఆమె డిశ్చార్జ్ అయింది.

అయితే, అందరి పరిస్థితీ ఆమెలా ఉండదు. గత ఫిబ్రవరిలో బ్రెజిల్‌లో మహమ్మారి విరుచుకుపడటం ప్రారంభించిన దగ్గర నుంచీ కనీసం 803 మంది గర్భిణీలు, అదేవిధంగా ప్రసవానంతర మహిళలు మరణించారు. గర్భం మీద కోవిడ్ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న బ్రెజిల్ టాస్క్‌ఫోర్స్ లెక్కల ప్రకారం.. ఈ మరణాలలో సగానికి పైగా అంటే సుమారు 432 కోవిడ్ కారణంగానే సంభావించాయి. ఇటీవలి వారాల్లో, బ్రెజిల్ వార్తాపత్రికలు ఈ వ్యాధితో మరణించిన యువ తల్లుల హృదయ విదారక కథలతో నిండి పోయాయి. 23 ఏళ్ల మరియా లారా ప్రుకోలి, అలాగే రియో ప్రసవానంతరం మరణించారు. లావానియా అనే ఆమె గత వారం అత్యవసర చికిత్స్ ద్వారా ప్రసవించిన తరువాత మరణించింది. అదేవిధంగా ఏప్రిల్ 3 న, గోమ్స్ ఆసుపత్రిలో చేరే మూడు రోజుల ముందు, ఏడు నెలల గర్భవతిగా ఉన్న 20 ఏళ్ల మహిళ, మధ్యప్రాచ్య రాష్ట్రమైన మాటో గ్రాసోలో, ఇంటెన్సివ్ కేర్ బెడ్ కోసం నాలుగు రోజులు వేచి ఉండి మరణించింది.

గర్భిణీలు, ప్రసవానంతర మహిళలకు కోవిడ్ ఎదురయ్యే ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. UK లో సహా ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్ల పెరుగుదల అలాగే రెండవ వేవ్ సమయంలో వెంటిలేటర్ వాడకం గురించి వైద్యులు దీని కోసం ఉదాహరిస్తున్నారు. అయితే, నిపుణులు, కార్యకర్తలు బ్రెజిల్ పరిస్థితి ముఖ్యంగా ఆందోళనకరంగా ఉందని, దేశంలో ఇటీవల కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున.. అది తగ్గేవరకూ పిల్లలు పుట్టడం ఆలస్యం చేయాలని అధికారులు ఇటీవల మహిళలను కోరారు.

“ఐసియు మంచం దొరకకుండా, వెంటిలేషన్ ఇవ్వకుండా, ఇంట్యూబేట్ చేయకుండా మహిళలు చనిపోతున్నారు … ఇది మేము నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి వస్తోంది.” అంటూ ఒక వైద్యాధికారి చెప్పారు. “మేము ఇక్కడ ప్రసూతి మరణాల విపత్తును ఎదుర్కొంటున్నాము” అని బ్రెజిల్ ప్రసూతి వైద్యుడు, గర్భధారణ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కార్లా ఆండ్రూచి చెప్పారు.
గత జూలైలో ఆండ్రూచి యొక్క బృందం ప్రపంచంలోని కోవిడ్-సంబంధిత మాతా మరణాలలో 77.5% దక్షిణ అమెరికా దేశంలో సంభవించిందని సూచించింది. అయినప్పటికీ కొన్ని తక్కువ-ఆదాయ దేశాలు అటువంటి డేటాను విడుదల చేయలేదని వారు గుర్తించారు. బ్రెజిల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ప్రతిచోటా నిండిపోయి ఉన్నాయి. దీంతో గర్భిణీలకు ఎటువంటి సహాయమూ అందించలేక నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది అక్కడి వైద్య శాఖ.

రియోలోని కోవిడ్ సెంటర్‌లో అంటు వ్యాధి నిపుణుడు రౌస్సా పెర్లింగైరో మాట్లాడుతూ, గత మూడు నెలల్లో, బ్రెజిల్ లో కరోనా  వ్యాప్తి తీవ్రతరం కావడంతో, తమ యూనిట్ చాలా బిజీగా మారిందనీ,  షిఫ్ట్‌లు మరింత కఠినంగా మారాయి అని చెబుతున్నారు. మునుపటి కంటే చాలా తీవ్రమైన పరిస్థితులతో రోగులు వస్తున్నారని ఆయన అంటున్నారు.

ఫ్రంట్‌లైన్ హెల్త్‌వర్కర్లను రక్షించే ప్రచారంలో భాగంగా టీకాలు వేసిన తర్వాత యూనిట్‌లో పనిచేయడం కొనసాగించాలని 32 ఏళ్ల డాక్టర్ చెప్పారు. “నేను ఇంత కష్ట సమయంలో పనికి దూరంగా ఉండలేను, జట్టు ఇప్పటికే చిన్నది” అని పెర్లింగీరో చెప్పారు.

Also Read: అమెరికా నుంచి ఇండియాకు ‘కోవిడ్ సహాయక’ విమానాల రాకలో జాప్యం, ఎందుకంటే ?

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?