AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ఇదే..! ఎక్కడి రైతులు పండించారో తెలుసా..!

World Largest Mango: మీరు చాలా రకాల మామిడి పండ్లను చూసి ఉండవచ్చు... కానీ ఇలాంటి మామిడి పండును ఎప్పుడు చూడకపోవచ్చు. మీరు దగ్గరగా చూడకపోతే..

ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ఇదే..! ఎక్కడి రైతులు పండించారో తెలుసా..!
World Largest Mango 01
Sanjay Kasula
|

Updated on: May 04, 2021 | 2:01 PM

Share

మీరు చాలా రకాల మామిడి పండ్లను చూసి ఉండవచ్చు… కానీ ఇలాంటి మామిడి పండును ఎప్పుడు చూడకపోవచ్చు. మీరు ఒక చూపులో ఆ పండు  సాధారణమైనదా… మరేదైనా ప్రత్యేకత ఉందా అనేది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇది అచ్చం పుచ్చకాయలా ఉంటుంది. బరువు, పరిమాణంలో ఇది పుచ్చకాయ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఇది సాధారణంగా 4 కిలోల కంటే ఎక్కువగా ఉంది. అవును, మామిడి పండ్లలో కూడా అలాంటి మహారాజా మామడి వెరైటీ ఉంది. అదేంటో… ఈ పండు ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం..

పుచ్చకాయ లాంటి ఈ మామిడి ఎక్కడ అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. మామిడి అనేక కిలోల బరువుతో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న నిజమైనదే.. ఎందుకంటే ఇది భారతదేశంలో కనిపించదు. మనం ఇక్కడ మాట్లాడుతున్న రకం భారతదేశంకు చెందిన వెరైటీ కాదు…, కొలంబియాకు చెందిన ఓ రైతు ఈ మామాడి రకం పండిస్తున్నాడు. మీరు ఇప్పటివరకు అత్యంత రుచికరమైన మామిడి గురించి విన్నట్లయితే.. ఈ మామిడి అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది.

ఉత్పత్తి ఎక్కడ జరిగింది?

కొలంబియన్ రైతులు పండించిన ఈ వెరైటీ.. ప్రపంచంలోనే అతి భారీ మామిడి పండుగా గుర్తింపును అందుకుంటోంది. ఈ మామిడి గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.., కొలంబియాలోని చిన్న ప్రదేశమైన గువాయితాలో రైతులు ఈ మామిడిని సాగు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిన లెక్క ప్రకారం ఈ మామిడి బరువు 4.25 కిలోలు.

గిన్నిస్‌లో పేరు నమోదు..

తమ వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్నఈ మామిడి సాధారణం కాదని, ప్రపంచంలో ఇది చాలా భిన్నమైనదని రైతు కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ వార్త చాలా విస్తృతంగా వైరల్ అవడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నిపుణులు ఈ రైతు క్షేత్రాన్ని సందర్శించి మామిడి బరువును లెక్కించారు. దీంతో ఈ మామిడికి గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇలాంటి మామిడి ప్రపంచంలో ఎక్కడా లేదని.., ఇంతకు ముందు ఏ మామిడి ఇలాంటి రికార్డును క్రియేట్ చేయ చేయలేదని గిన్నిస్ రికార్డ్ నిపుణులు అంటున్నారు.

అంటువ్యాధి మధ్య మంచి ఉద్యోగం

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం వదిలిపెట్టిన ఈ కుటుంబం .. వ్యవసాయ సాగుపై ఫోకస్ పెట్టింది. అయితే వారు చేసిన ప్రయత్నం రెండు సంవత్సరాల్లోనే ఫలితాన్ని ఇచ్చింది. ఈ మామిడిని ఉత్పత్తి చేసిన  కొలంబియా రైతులు కష్టపడి పనిచేశారు. అంకితభావంతో ప్రేమతో పండించాలని సందేశాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా పండించినట్లయితే అవుట్పుట్ ఎల్లప్పుడూ మంచిగా ఉంటుదని అంటున్నారు. ఇలాంటి సమయంలో  ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలి అని అంటున్నారు.

ఇది కూడా చదవండి: PM Suraksha Bima Yojana: కేవలం 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు బీమా పొందండి… ఆ వివరాలు ఇలా తెలుసుకోండి..

Janhvi Kapoor: ఎల్లోరా శిల్పంలా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా..