తెల్ల జుట్టుకు కలర్ వాడుతున్నారా..! అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..? ఫలితం ఉండదు..
Hair Coloring : ఈ రోజుల్లో చాలామంది తెల్లజుట్టుకు కలర్ వేస్తున్నారు. అయితే జుట్టుకు రంగు వేసిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహించాలని
Hair Coloring : ఈ రోజుల్లో చాలామంది తెల్లజుట్టుకు కలర్ వేస్తున్నారు. అయితే జుట్టుకు రంగు వేసిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కలర్ వేసుకున్న రెండు మూడు రోజులకే మళ్లీ వెంట్రుకలు తెల్ల రంగులో కనిపిస్తూ ఉంటాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. దీంట్లో మొదటిది కలర్ నాణ్యతగా లేకపోవడం రెండోది మీరు చేసే తప్పుల వల్ల ఇలా జరుగుతుంది. మీరు వేసుకున్న డై ఎక్కువ రోజులు నిలవాలంటే ఇలా చేయండి.
కలర్ వేసిన తర్వాత కెమికల్స్ అంతగా లేని షాంపూతో స్నానం చేయాలి. కానీ అందరూ రెగ్యులర్ షాంపూలనే వాడుతారు. ఇది కలర్ పోవడానికి కారణమవుతుంది. అందుకే కలర్ వేసుకున్న తర్వాత ఇలా చేయకూడదు. గతంలో ప్రజలు తమ జుట్టును స్టైల్‌గా మార్చుకోవడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ధోరణి నెమ్మదిగా మారుతోంది. స్టైలింగ్ సాధనాలను ఉపయోగించి ఇంట్లోనే హెయిర్‌ని స్టైల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
జుట్టుకు రంగు వేసి హీట్ ప్రొటెక్టర్ ఉపయోగించకుండా టూల్స్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు రంగు మారుతోంది. హీట్ ప్రొటెక్టర్‌లో లభించే సిలికోసిస్, మాయిశ్చరైజింగ్ ఏజెంట్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే కొంతమందికి వేడి నీటితో తలస్నానం చేయడం అలవాటు. అయితే కలర్ వేసుకొని వేడి నీటితో స్నానం చేయకూడదు. దీనివల్ల కలర్ మొత్తం పోయి జుట్టు బలహీనపడుతుంది. వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. ఇది మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండాఆరోగ్యంగా ఉంచుతుంది. హెయిర్ కలర్ తర్వాత ఈ చిన్న చిన్న తప్పులు చేయవద్దు. అప్పుడే కలర్ హెయిర్‌కి చాలాకాలం ఉంటుంది.