AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్రావిడ రాజకీయాల్లో కొత్త శకం.. అన్నాడీఎంకేతో కలిసి అడుగులు.. తమిళనాడు అసెంబ్లీలోకి కమలదళం ఎంట్రీ

దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది.

ద్రావిడ రాజకీయాల్లో కొత్త శకం.. అన్నాడీఎంకేతో కలిసి అడుగులు.. తమిళనాడు అసెంబ్లీలోకి కమలదళం ఎంట్రీ
BJP
Balaraju Goud
|

Updated on: May 04, 2021 | 3:03 PM

Share

దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది. అన్నాడీఎంకేతో కలిసి ఎట్టకేలకు తమిళ అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, ఒడిషాలలో ఏదో ఓ సమయంలో లేదా ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కానీ సుదీర్ఘకాలంగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా బీజేపీకు చోటివ్వని రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వాలనే కమలనాధుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో జతకట్టి పోటీ చేసింది. 20 స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరికను నెరవేర్చుకుంది.

నాలుగేళ్లపాటూ ఎడపాడి ప్రభుత్వాన్ని కాపుగాసిన కమలనాథులు అన్నాడీఎంకే కూటమిలో కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు కోరారు. తీవ్రస్థాయిలో తర్జన భర్జనల తరువాత 20 సీట్లకు అంగీకారం కుదిరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా.. కనీసం ఒక్కసీటైనా గెలిచి తీరుతాం, అసెంబ్లీలో అడుగుపెడతామని బీజేపీ నేతలంతా సవాల్‌ విసిరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. మురుగన్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సినీనటి కుష్బు, అగ్రనేత హెచ్‌. రాజా తదితర హేమా హేమీలను పోటీపెట్టారు. ప్రధాని మోదీ, అమిత్‌షా ఇతర కేంద్రమంత్రులు ప్రచారం చేశారు.

జయలలిత మరణం,శశికళ జైలుకెళ్లడం తరవాత జరిగిన పరిణామాల్లో తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ మాత్రమే కాపాడుతూ వచ్చింది. తమిళనాట కమలం ముద్రవేసేందుకు చేసిన విశ్వ ప్రయత్నాల్లో ఇదొకటి. అటు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు బీజేపీ అగ్రనేతలు చెప్పినట్టే చేశారు.

పోటీచేసిన మొత్తం 20 స్థానాల్లో నాలుగింటిలో మాత్రమే గెలుపొందగా, వీటిల్లో కీలకస్థానమైన కోయంబత్తూరు దక్షిణంను సొంతం చేసుకోవడం విశేషం. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపు డు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని బీజేపీ రెండుసీట్లు గెలుచుకుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే అన్నాడీఎంకే కూటమి నుంచి బరిలోకి దిగి నాలుగు సీట్లను సొంతం చేసుకుంది.

Read Also…. High Court: హైకోర్టులో జమున హెచరీస్ పిటీషన్ విచారణ.. నోటీసులు వివరాలను ఇవ్వాలని ఆదేశించిన కోర్టు