Black Death: మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రష్యాలో మళ్ళీ వెలుగులోకి బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి..

Plague (Black Death):వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు,  గ్లోబల్ వార్మింగ్ కారణంగా బుబోనిక్ ప్లేగు తిరిగి మళ్ళీ విజృంభించే అవకాశం ఉందని రష్యా లోని ప్రముఖ డాక్టర్ చెప్పారు..

Black Death: మానవాళికి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రష్యాలో మళ్ళీ వెలుగులోకి బ్లాక్ డెత్ ప్లేగు వ్యాధి..
Black Death
Follow us

|

Updated on: Oct 13, 2021 | 8:23 PM

Plague (Black Death):వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు,  గ్లోబల్ వార్మింగ్ కారణంగా బుబోనిక్ ప్లేగు తిరిగి మళ్ళీ విజృంభించే అవకాశం ఉందని రష్యా లోని ప్రముఖ డాక్టర్ చెప్పారు. బ్లాక్ డెత్ వల్ల కలిగే ముప్పును గుర్తించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రజారోగ్యానికి ‘ప్రమాదంగా మారిందని అన్నారు. వివరాల్లోకి వెళ్తే..

డాక్టర్ అన్నా పోపోవా మాట్లాడుతూ, “గ్లోబల్ వార్మింగ్ , వాతావరణ మార్పులు పర్యావరణంతో పాటు మానవులపై కూడా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. రోజు రోజుకీ ప్లేగు వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుందని తమ అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు.   ఈ వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం వెంటనే ఈగల వ్యాప్తిని నివారించడం అత్యవసరమని డాక్టర్ అన్నా చెప్పారు.

బ్లాక్ డెత్ అని కూడా పిలువబడే ప్లేగు ఇప్పటి వరకూ 200 మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంది.  14 వ శతాబ్దంలో ఈ వ్యాధి బారిన పడడంతో యూరప్ జనాభాలో 60% తుడిచిపెట్టుకుపోయింది. ఇక రష్యా, యుఎస్, చైనా ఇటీవలి మళ్ళీ ఈ వ్యాధి మూలాలు కనిపించాయి. దీంతో ఈ ప్లేగు వ్యాప్తిని నియంత్రించడానికి, వాతావరణ సంక్షోభంపై కఠిన చర్యలు తీసుకోవాలని యునిసెఫ్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.  కాంగో, మడగాస్కర్ ,పెరూ దేశాల్లో బుబోనిక్ ప్లేగు కేసులు దాదాపు ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ నుంచి  ఏప్రిల్ మధ్య నమోదవుతాయి.

బుబోనిక్ ప్లేగు అనేది బ్యాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. ఇది అడవి ఎలుకలపై వాలిన ఈగల నుంచి వ్యాపిస్తుంది.  ఈ ప్లేగు సోకినట్లు  సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే  కేవలం 24 గంటలోనే వ్యాధి సోకిన బాధితులు మరణించే అవకాశం ఉంది.  అయితే ఈ బుబోనిక్ ప్లేగు  ఒకరి నుంచి మరొకరికి సోకడం అనేది చాలా అరుదు. జంతువుల నుంచి ముఖ్యంగా ఈగల నుంచి మాత్రమే మానవునికి సోకుతుందని తెలుస్తోంది. ప్లేగుతో బాధపడుతున్న వ్యక్తులు తీవ్ర జ్వరంలో బాధపడతారు. చలి, తలనొప్పి, శరీరం నొప్పులు, నరాల బలహీనత, వాంతులు, వికారం వంటి లక్షలు కనిపిస్తాయి.

Also Read:   మొద‌టిసారిగా శ్రీవారికి ప‌టిక‌బెల్లం, కివి పండ్లు, ఎరుపు ప‌విత్రమాల‌ల‌తో స్నప‌న తిరుమంజ‌నం..