AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Breath Test: శ్వాస పరీక్ష ద్వారా కోవిడ్ నిర్ధారణ.. నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడి.. పూర్తి వివరాలు..

Covid Breath Test: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనాను..

Covid Breath Test: శ్వాస పరీక్ష ద్వారా కోవిడ్ నిర్ధారణ.. నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడి.. పూర్తి వివరాలు..
Breath Test
Shiva Prajapati
|

Updated on: May 24, 2021 | 4:40 PM

Share

Covid Breath Test: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనాను గుర్తించేందుకు నిర్వహించే టెస్టుల ఫలితాలు ఆలస్యం అవుతుండటం కూడా మరణాలు రేటు పెరగడానికి కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా టెస్టులు, ఫలితాలు వేగంగా వచ్చేలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగపూర్ ప్రభుత్వం.. ఒక నిమిషంలోపే కరోనా టెస్ట్ ఫలితం వచ్చే సరికొత్త టెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్వాస ద్వారా కోవిడ్ టెస్ట్ నిర్వహించి, నిమిషం వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే ‘బ్రీత్ టెస్ట్’‌కు సింగపూర్‌లో అనుమతి లభించింది. ఈ విషయాన్ని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ స్పిన్-ఆఫ్ స్టార్టప్ బ్రీథోనిక్స్ అభివృద్ధి చేసిన ఈ పరీక్ష.. బ్రీతలైజర్ వలే పని చేస్తుందన్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం పోలీసులు ఉపయోగించే బ్రీతలైజర్ మాదిరిగా పని చేస్తుందని, దీని ద్వారా వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఉందా? లేదా? అనేది నిమిషాల వ్యవధిలోనే తెలిసి పోతుందన్నారు. వ్యక్తి శ్వాస నుంచి వచ్చే వైరస్‌ను డిటెక్ట్ చేసేలా ఇందులో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం సింగపూర్‌లోని పశ్చిమాన ఉన్న ఓ ఐలాండ్‌లోని తువాస్ చెక్‌పాయింట్ వద్ద మలేషియా నుంచి సింగపూర్‌కు వచ్చే ప్రయాణికులను ఈ బ్రీతలైజర్‌తో టెస్ట్‌ చేశారు. పీసీఆర్ టెస్ట్ మాదిరిగానే స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సింగపూర్‌లో ప్రస్తుతం యాంటిజెన్ టెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. దాంతోపాటుగా బ్రీతలైజర్‌ టెస్ట్‌లను కూడా కొనసాగిస్తున్నారు.

బ్రీథోనిక్స్ ఇప్పటివరకు మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. రెండు ట్రయల్స్ సింగపూర్‌లో నిర్వహించగా.. ఒకటి దుబాయ్‌లో నిర్వహించారు. తొలుత సింగపూర్‌లో 180 మంది రోగులపై పైలట్ ప్రాజెక్టుగా పరీక్షలు నిర్వహించారు. 95 శాతం ప్రభావవంతంగా పని చేసినట్లు పరిశోధకులు నిర్ధారించారు.

Also read:

Madras IIT: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై మద్రాస్ ఐఐటీ ఉచిత ఆన్‌లైన్ కోర్సు..ఎలా దరఖాస్తు చేసుకోవాలి..పూర్తి వివరాలు

Love Story movie: సంచలనాలు సృష్టిస్తున్న సారంగదరియా సాంగ్.. తాజాగా మరో రికార్డు..