Health News: శీతాకాలంలో ఆ ముప్పు తప్పదట.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్య నిపుణులు..

Health News: కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని, శీతాకాలంలో మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఆరోగ్య నిపుణులు.

Health News: శీతాకాలంలో ఆ ముప్పు తప్పదట.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్య నిపుణులు..
Covid 19
Follow us

|

Updated on: Sep 03, 2022 | 8:47 PM

Health News: కోవిడ్ మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని, శీతాకాలంలో మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఆరోగ్య నిపుణులు. నిత్యం తనను తాను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతున్న కోవిడ్ మహమ్మారి.. ఇప్పుడు రానున్న శీతాకాలంలో మరో కొత్త వేరేయంట్ రూపంలో విజృంభించే ఛాన్స్ ఉందని యూరోపియన్ యూనియన్ డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. అయితే, ఇప్పుడు వేస్తున్న టీకాలు, కరోనా తీవ్రతను తగ్గించే అవకాశం ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

కాగా, ఈయూ డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీ చేసిన ప్రకటనతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉందన్న మాటతో బూస్టర్ డోస్‌పై ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోస్ వేసుకునేలా ప్రచారం చేస్తోంది. కాగా, కోవిడ్ 19, కోవిడ్ 19 వేరియంట్స్‌ను తట్టుకునే శక్తి కలిగిన బూస్టర్ డోస్‌లకు ఈయూ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ప్రజలు నిర్దిష్ట టీకా కోసం ఎదురు చూస్తూ కోర్చొవద్దని, అంచనా వేయలేని కొత్త వేరియంట్ ఉద్భవించొచ్చని యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వ్యాక్సీనేషన్ చీఫ్ మార్కో కావలెరీ తెలిపారు.

ఇకపోతే ఈఎంఏ ఫైజర్, బయోన్‌టెక్ బూస్టర్ డోస్‌లకు ఆమోదం తెలిపింది. న్యూ ఓమిక్రాన్, BA.1 సబ్ వేరియంట్‌ను ఇవి సమర్థంగా ఎదుర్కొంటాయని విశ్వసిస్తున్నారు. కాగా, ఫైజర్ ప్రస్తుతం ఉన్న BA.4, 5 వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అలాగే, రానున్న కాలంలో మరింత సమర్థవంతమైన వ్యాక్సీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..