AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project 75I: సముద్రంలో సైలెంట్ హంటర్స్.. గుంట నక్క చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ కొత్త వ్యూహం!

హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనాకు చెక్ పెట్టేందుకు భారత నావికాదళం సరికొత్త వ్యూహరచన చేస్తోంది. సముద్ర జలాల్లో శత్రువుల రాడార్లకు ఏమాత్రం చిక్కని ఆరు అత్యాధునిక సబ్‌మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. దేశీయ రక్షణ రంగాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చే ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం అక్షరాలా రూ. 99,000 కోట్లు ఖర్చు చేస్తోంది.

Project 75I: సముద్రంలో సైలెంట్ హంటర్స్.. గుంట నక్క చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్ కొత్త వ్యూహం!
Indian Navy Project 75i
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 18, 2026 | 12:50 PM

Share

భారత భద్రతా ముఖచిత్రాన్ని మార్చేసే ఈ మెగా ప్రాజెక్‌టు ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ప్రభుత్వ రంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ (MDL), జర్మనీకి చెందిన థిస్సన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (TKMS) మధ్య కీలక ఈ ప్రాజెక్టు సంబంధించిన వ్యాపార చర్చలు విజయవంతంగా ముగిశాయి. త్వరలోనే అధికారిక ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు కూడా చేయనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ భారీ ప్రాజెక్టుకు ‘ప్రాజెక్ట్-75I’ అని నామకరణం చేశారు. దీని ద్వారా ఇండియన్ నేవీకి సముద్రంలో తిరుగులేని బలం చేకూరనుంది. తక్కువ ఖర్చుతోనే అణు సబ్‌మెరైన్ల స్థాయి సామర్థ్యాన్ని ఈ ఆరు జలాంతర్గాములు సొంతం చేసుకోనున్నాయి.

ఈ జలాంతర్గాముల ప్రధాన బలం ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (AIP) టెక్నాలజీ. సాధారణ సబ్‌మెరైన్లు బ్యాటరీ రీఛార్జ్ కోసం తరచూ నీటి ఉపరితలం పైకి రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్యూయల్-సెల్ AIP సాంకేతికత వల్ల, ఇవి ఉపరితలంపైకి రాకుండానే వారాల తరబడి సముద్ర గర్భంలోనే ఉండగలవు. శత్రు కదలికలను పసిగట్టడంలో ఇవి అదృశ్య వేటగాళ్లుగా పనిచేస్తాయి. అందుకే వీటిని ‘సైలెంట్ హంటర్స్’ అని పిలుస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌లోనే నిర్మించనున్నారు.

జర్మనీ నుంచి సాంకేతిక బదిలీ (Transfer of Technology) ద్వారా ఈ నిర్మాణ ప్రక్రియ జరగనుంది. ఈ ప్రాజెక్టుతో దేశీయ రక్షణ రంగ తయారీ సామర్థ్యం మరో మెట్టు పైకి ఎక్కనుంది. మన దేశ రక్షణ రంగంలో ఇదొక కీలక మైలురాయిగా మారనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ డీల్ ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా నౌకాదళ సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడంలో ఇది భారత్‌కు కచ్చితమైన ‘గేమ్ చేంజర్’ అవుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశ రక్షణ వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వస్తుందనగానికి ఇదే నిదర్శనం కానుంది. ఈ అదృశ్య సబ్‌మెరైన్ల రాకతో సముద్రంలో మన దేశ భద్రత సుస్థిరం కానుంది. భవిష్యత్తులో చైనా కుట్రలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త సికందర్లు జలగర్భంలో ఎలా గర్జించనున్నాయో వేచి చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us