Bangladesh PM: భారత పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. కీలక చర్చలకు ఆస్కారం..

Bangladesh PM: ఈనెల 5వ తేదీ నుండి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు విచ్చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల..

Bangladesh PM: భారత పర్యటనకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. కీలక చర్చలకు ఆస్కారం..
Sheikh Hasina
Follow us

|

Updated on: Sep 03, 2022 | 9:23 PM

Bangladesh PM: ఈనెల 5వ తేదీ నుండి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు విచ్చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత షేక్ హసీనా భారత్ పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో షేక్ హసీనా తో పాటు వివిధ మంత్రులు, సెక్రటరీలు, బిజినెస్ రంగ ప్రముఖులు కూడా వస్తున్నారు. ఈ పర్యటనలో ఆమె రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా ను సందర్శించునన్నది. అలాగే, కొత్తగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధనంకార్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లను కలవబోతున్నారు. ఈ పర్యటనలో ఖుషియారా నదిలో నీటి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయబోతున్నాయి.

అలాగే 1971 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 200 మంది ఇండియన్ ఆర్మీ పర్సనల్స్‌కు ముజిబ్ స్కాలర్షిప్‌ను అందించునున్నారు బంగ్లాదేశ్ ప్రధాని. ఈ పర్యటనలో భారతీయ పెట్టుబడులను స్వాగతించడానికి సీఐఐ నిర్వహించే సదస్సులో పాల్గొని వ్యాపారవేత్తలను బంగ్లాదేశ్ కు ఆహ్వాననించున్నారు. ఈ పర్యటన ఇరుదేశాల ఆర్థిక, వ్యూహాత్మక మరియు వివిధ రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలను ఎదుర్కోవడానికి షేక్ హసీనాకు ఈ పర్యటన ఎంతో కీలకం.

దక్షిణాసియాలో శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం చైనా నుండి తీసుకున్న అప్పులు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ లోని ప్రధాన మీడియా స్రవంతి, సోషల్ మీడియాలో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం గురించి చర్చ చాలా ఎక్కువగా జరుగుతోంది. బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధేయపడడం, విద్యుత్ సంక్షోభం, వివిధ రంగాలలో పెరుగుతున్న అవినీతి, గత నెలలోనే 51.2 శాతం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల లాంటివి ఈ చర్చకు గల ముఖ్య కారణాలు. దక్షిణాసియాలో శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ మోనిటర్ ఫండ్ (ఐఎంఎఫ్) నుండి 4.5 బిలియన్ డాలర్లు, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ల నుండి ఒక్కొక్క బిలియన్ డాలర్లు చొప్పున బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం ప్రాధేయపడుతుంది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం చర్చను ఖండిస్తోంది. తమ ప్రభుత్వంలో అభివృద్ధి మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి ద్వారా తిరిగి ఆదాయం వస్తున్నది అని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

నిజానికి శ్రీలంక, పాకిస్తాన్ లో పరిస్థితులకి బంగ్లాదేశ్ లో పరిస్థితి కొంత బిన్నంగా ఉన్నది. శ్రీలంక, పాకిస్తాన్ ల ఉమ్మడి జీడీపీ బంగ్లాదేశ్ జీడీపీతో సమానం. బంగ్లాదేశ్ దగ్గర 36 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యాలు ఉండగా.. పాకిస్తాన్, శ్రీలంక దగ్గర ఉమ్మడిగా కేవలం18 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్యాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కు ఉన్న అప్పులు జీడీపీ లో కేవలం 31 శాతమే, శ్రీలంక అప్పులు జీడీపీలో 119 శాతంగా ఉన్నాయి. గత 2021 వ సంవత్సరంలోనే 22 బిలియన్ డాలర్లు (రెమిట్టన్స్) ను వివిధ దేశాలలో స్థిరపడిన బంగ్లాదేశీయులు మాతృదేశానికి పంపారు. ప్రపంచంలో రెమిట్టన్స్ ను తీసుకునే దేశాలలో బంగ్లాదేశ్ 7 వ స్థానంలో ఉంది. ఈ రెమిట్టన్స్ ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యాలు ఆర్థిక లోటును తీర్చుటకు ఎంతగానో ఉపయోగపడతాయి.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న ఆయిల్ రేట్లు భారాన్ని తగ్గించుకోడానికి, రష్యా నుండి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనడానికి బంగ్లాదేశ్ చర్చలు జరుపుతుంది. బహిరంగ మార్కెట్‌లో ఒక క్రూడ్ ఆయిల్ బారెల్ ధర 100 డాలర్లు ఉండగా రష్యా కేవలం రిఫైన్డ్ ఆయిల్‌‌ను 59 డాల్లర్ల కే అమ్మడానికి సిద్ధంగా ఉన్నది. క్రూడ్ ఆయిల్‌ను రష్యా ఇంకా తక్కువ ధరకు ఇవ్వడానికి సిద్ధపడిన కానీ బంగ్లాదేశ్ కు క్రూడ్ ఆయిల్ ను రిఫైన్ చేసుకునే సదుపాయం లేదు. అయితే పెద్ద షిప్పింగ్ కంపెనీస్ రష్యా పోర్ట్స్ నుండి వ్యాపారాన్ని దాదాపుగా నిలిపివేశాయి. ఇలాంటి పరిణామాలలో షేక్ హసీనా రష్యన్ ఆయిల్ షిప్పింగ్ కోసం భారత్ సాయాన్ని కోరవచ్చు. అలానే స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి రష్యా ను తీసివేసినందు వల్ల క్రూడ్ ఆయిల్ చెల్లింపులు బంగ్లాదేశ్ కు ఇబ్బంది కలగవచ్చు. ఒకవేళ రష్యా నుండి రిఫైన్డ్ ఆయిల్ లేక క్రూడ్ ఆయిల్ కొంటే పాశాత్య దేశాల అదుపులో ఉన్న ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు లు బంగ్లాదేశ్ ప్రాధేయపడుతున్న బెయిల్ అవుట్ ప్యాకేజీ కోసం ఎంత మేర సహాయ పడతాయో చూడాలి.

బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలతో బంగ్లాదేశ్ డీజిల్ ద్వారా ఉత్పత్తి చేసే 1000 మెగా వాట్స్ విద్యుత్తు ప్లాంట్ లను మూసేసింది. ఫలితంగా వారంలో 5 రోజులు మాత్రమే విద్యాసంస్థలు, గవర్నమెంట్ కార్యాలయాలు రోజుకి ఒక గంట తక్కువ పాటు పని చేయనున్నాయి. ఈ విద్యుత్ సంక్షోభంని అధిగమించటానికి ఉత్తర బంగ్లాదేశ్ లోని రొప్పూర్ ప్రాంతంలో 2,400 మెగా వాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని 12.5 బిలియన్ డాలర్లు రష్యా సహకారంతో నిర్మిస్తుంది. కానీ దానికి అయ్యే ఖర్చు ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉన్నది. భారత్ కు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 120 కి.మీ పొడువునా 400 కిలో వాట్స్ విద్యుత్తు సరఫరా లైన్ ను బరపుకురియా నుండి బోగూర వరకు 900 కోట్లతో నిర్మిస్తుంది. భారత్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ కు డబ్బును అప్పుగా ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తర బంగ్లాదేశ్‌లో హై వోల్టాజ్ విద్యుత్తు సరఫరాకు ఇబ్బంది కలగదు. దాంతో పాటుగా ఝార్ఖండ్ నుండి బంగ్లాదేశ్ కు 1,600 మెగా వాట్లు విద్యుత్తును సరఫరా చేయుటకు సదుపాయం కలుగుతుంది.

నాలుగు చైనా దేశ కంపెనీలు బంగ్లాదేశ్ లోని చిట్టిగ్యాంగ్ కి సమీపంలో 60స్క్వేర్ కి.మీ పరిధిలో స్మార్ట్ సిటీ, మెట్రో రైల్ ప్రాజెక్ట్ లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసాయి. ప్రతిఫలంగా స్మార్ట్ సిటీలో ప్లాట్స్ అమ్మేసిన తర్వాత వచ్చే లాభాన్ని చైనా కంపెనీలు ఆర్జించునున్నాయి. దీనివలన పర్యావరణ కాలుష్యం జరగవచ్చు. కానీ చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీతో పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తామని చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం చిట్టిగ్యాంగ్ నగర అభివృద్ధి అని చెబుతున్నప్పటికీ, వ్యూహాత్మకమైన చిట్టిగ్యాంగ్ లోని పోర్ట్ ని స్వాధీనం చేసుకోడానికి మొదటి అడుగుగా అర్ధం చేసుకోవచ్చు. శ్రీలంకలోని హంబన్ తోట పోర్ట్ ని అభివృద్ధి పేరుతో ఇలానే చైనా ప్రతిపాదించి ఆఖరుకి 99 సంవత్సరాల లీజ్ కి స్వాధీనపర్చుకుంది. షేక్ హసీనా పర్యటనలో మోడీ ప్రభుత్వం చైనా ప్రతిపాదనలకు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత దశాబ్ద కాలంలో షేక్ హసీనా ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణాల మీద చాలా వరకు పెట్టుబడి పెట్టింది. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశాభివృద్ధికి 19 నైరుతి రాష్ట్రాలను మిగతా దేశానికి కలుపుతూ పద్మ నది మీద 6.5 కి.మీ పొడవైన రోడ్డు, రైలు వంతెన కట్టడం ఆ దేశ చరిత్రలో చారిత్రాత్మకంగా మిగిలిపోనుంది. గత జూన్ నెల 25 వ తేదీన షేక్ హసీనా ఈ వంతెన ను ప్రారంబించారు. ఈ వంతెన ను బంగ్లాదేశ్ ప్రభుత్వ నిధులతో చైనా కంపెనీ నిర్మించడం కొంత మేర ఆందోళన కలిగించే పరిణామం.

షేక్ ముజిబూర్ రెహమాన్‌కి భారత్‌తో ఉన్న సాన్నిహిత్యం వలన తన కూతురు అయినా షేక్ హసీనా ప్రధాని అయినప్పటి నుండి భారత్‌తో మంచి సంబంధాలను కనబరుస్తున్నారు. భారత్ కు ఉన్న ఇబ్బందులని అర్ధం చేసుకుంటూ చైనాతో సంబంధాలను షేక్ హసీనా జాగ్రత్తగా కొనసాగిస్తూ వస్తున్నారు. భారత్ కూడా షేక్ హసీనాకు ఉన్న ఇబ్బందులను అర్ధం చేసుకొని ఆమెకు అండగా నిలుస్తుంది. భారత్ దృష్టిని ఆకర్షించడానికి గత నెలలో జరిగిన కృష్ణుని జన్మాష్టమి వేడుకులలో షేక్ హసీనా పాల్గొని తమ ప్రభుత్వం హిందూ సమాజానికి అండగా ఉంటామని చెప్పారు. అయితే వచ్చే ఏడాది ఎన్నికలకు ఏడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి షేక్ హసీనా కు సవాల్ విసురుతున్నాయి. ప్రతిపక్ష రాజకీయ కూటమిని, దేశం ముందు ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఆమెకు భారత్ సాయం ఎంతో అవసరం.

– కె. వెంకట కృష్ణ రావు, రీసెర్చ్ స్కాలర్, ఐఐటీ వారణాసి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?