China: చైనాను వీడిని కరోనా భయం.. చేపలు, పీతలకూ వైరస్.. మండిపడుతున్న ప్రజలు

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాను (China) వైరస్ వీడడం లేదు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చాలా నగరాలు ఇప్పటికీ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కఠిన ఆంక్షలు అమలు..

China: చైనాను వీడిని కరోనా భయం.. చేపలు, పీతలకూ వైరస్.. మండిపడుతున్న ప్రజలు
Corona In China
Follow us

|

Updated on: Aug 20, 2022 | 6:57 AM

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాను (China) వైరస్ వీడడం లేదు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చాలా నగరాలు ఇప్పటికీ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే ఎంత జాగ్రత్త పడుతున్నా వైరస్ భయం మాత్రం వెళ్లడం లేదు. అక్కడ మనుషులకే కాదు, చేపలు, పీతలకూ కొవిడ్‌ టెస్ట్‌లు చేస్చుండటం సంచలనంగా మారింది. చైనాలో జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించేందుకు డ్రాగన్ ప్రభుత్వం జీరో కొవిడ్‌ (Zero Covid) పాలసీ ని పాటిస్తోంది. బీజింగ్‌, షాంఘై వంటి నగరాల్లో రోజుల తరబడి లాక్‌డౌన్లు విధించింది. లక్షలాది మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతాన్ని క్వారంటైన్‌ జోన్‌గా మార్చేసి కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిబంధనలు అమలు చేసింది. కర్ఫ్యూ ఆంక్షలూ విధించడంతో ప్రజలు ఆహారం దొరకక ఆకలికి అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారీగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో అధికారులు చేపట్టిన చర్యలు ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి. తినే ఆహారం నుంచి కూడా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందంటూ మనుషులతో పాటు సీ ఫుడ్‌కు కూడా కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. జియామెన్‌ నగరంలోని నాన్‌వెజ్‌ మార్కెట్‌లో PPE కిట్‌ ధరించిన వైద్య సిబ్బంది అక్కడి చేపలు, పీతలకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

సోషల్‌ మీడియాతో పాటు, సౌత్‌ చైనా మార్నింగ్‌లో ఈ వీడియోస్‌ వైరల్‌గా మారాయి. అధికారుల అతి చర్యల కారణంగా కొవిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ మీద పెట్టే ప్రజాధనం వృధా అవుతోందని జనం విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే మత్స్యకారుల కారణంగా చేపలకు పీతలకు కూడా కొవిడ్‌ సోకే అవకాఃం ఉన్నందున ముందు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించడంలో తప్పేమీ లేదని అధికారులు చెబుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..