AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Drought: చైనాలో విలయతాండవం చేస్తున్న కరువు.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..

China Drought: గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. చైనాలోని మూడో అతిపెదద్ ప్రావిన్స్‌ సిచువాన్‌లో ప్రవహించే యాంగ్జీ నదిలో నీరు అడుగంటిపోయింది. సిచువాన్‌లో గతంలో ఎన్నడూ...

China Drought: చైనాలో విలయతాండవం చేస్తున్న కరువు.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..
China Drought
Narender Vaitla
|

Updated on: Aug 20, 2022 | 6:50 AM

Share

China Drought: గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. చైనాలోని మూడో అతిపెదద్ ప్రావిన్స్‌ సిచువాన్‌లో ప్రవహించే యాంగ్జీ నదిలో నీరు అడుగంటిపోయింది. సిచువాన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరితిపోయాయి. దాదాపు 61 ఏళ్ల తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఎక్కడ చూసినా నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని 51 నదులు, 24 రిజర్వాయర్లు పూర్తిగా అడుగంటాయి.

యాంగ్జీ నదిలో నీటి స్థాయిలు పూర్తిగా తగ్గడంతో జలరవాణాను సైతం నిలిపివేశారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. అక్కడి ప్రజలు తాగు నీరు లభించక అల్లాడిపోతున్నారు. సిచువాన్‌ ప్రావిన్స్‌లో 80 శాతం విద్యుత్‌ అవసరాలు తీర్చేది యాంగ్జీ నదిలో జనరేట్‌ అయ్యే విద్యుతే. అయితే హైడ్రో పవర్‌ జనరేషన్‌కు అవకాశం లేకపోవడంతో విద్యుత్‌ సంక్షోభం కూడా ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..

తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో చైనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కృత్రిమంగా వర్షాలు కురిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. యాంగ్జీ నది ప్రవహించే పరిసర ప్రాంతాల్లో క్లౌడ్‌ సీడింగ్ ప్రారంభించారు. ఈ విధానం ద్వారా కొన్ని ప్రత్యేక విమానాలతో మేఘాల్లోకి సిల్వర్‌ అయోడిన్‌ను వదులుతారు. దీంతో ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. సిచువాన్‌తో పాతు హుబే ప్రావిన్స్‌లోనూ ఈ విధానాన్ని చేపట్టేందుకు అధికారులు పూనుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..