విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించండి… ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్…

విమానయాన రంగంలో పనిచేసే సిబ్బందిని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రపంచ దేశాలను కోరింది.

విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా గుర్తించండి... ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 16, 2020 | 8:31 AM

విమానయాన రంగంలో పనిచేసే సిబ్బందిని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రపంచ దేశాలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విమాన సిబ్బందిని సైతం కరోనా వారియర్స్‌గా పరిగణించాలని కోరింది. వ్యాక్సిన్ను దేశదేశాలకు సరఫరా చేసేందుకు 8 వేల బోయింగ్ 747 విమానాలు అవసరం కానున్నాయని, వ్యాక్సిన్ తరలింపునకు వేలాది మంది విమాన సిబ్బంది అవసరమైతారని అసోసియేషన్ సీఈఓ జునిక్ తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరాలో కీలకం కానున్న నేపథ్యంలోనే విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్‌గా పరిగణించాలని కోరారు. కాగా ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వ్యాక్సిన్ తరలింపు విషయంలో వర్డల్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కలిసి పని చేయనుంది.