కుప్పకూలిన బంగారు గని.. ప్రాణాలకు తెగించి 9మంది మైనర్లను కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్
VIRAL video: తొమ్మిది మంది మైనర్లు సురక్షితంగా గని నుండి బయటకు వచ్చారు ఒక వ్యక్తి.
సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కురిసిన వర్షాల ధాటికి బంగారు గని కుప్పకూలిపోయింది. వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నారు. అయితే మట్టి దిబ్బల్లో చిక్కుకున్న 9మంది మైనర్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కాంగోలో బంగారం అక్ర తవ్వకాలు జరిపుతోంది ఓ కంపెనీ. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండానే ఈ దందా కొనసాగుతోంది. భారీ వర్షాల కారణం బంగారు గని కూలిపోయింది. అనేక మంది దానిలో చిక్కుకునిపోయారు. అయితే 9మంది క్షేమంగా బయటపడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో తొమ్మిది మంది మైనర్లు సురక్షితంగా గని నుండి బయటకు వచ్చారు ఒక వ్యక్తి. అయితే గనిలో పని చేసే సహోద్యోగుల్లో ఒకరు.. వారిని రక్షించడానికి తన చేతులతో మట్టి దిబ్బలను త్రవ్వడం ద్వారా ఒక్కొక్కరుగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాంగోలో బంగారం తవ్వకాలు జరిపేందుకు కెనడా మైనింగ్ కంపెనీ బన్రో కార్పోరేషన్ అనుమతి ఉండాలని, అయితే ఈ గని దాని పరిధిలో లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Yesterday in DR Congo at around 2pm: artisanal copper miners saving each in Luwowo, in the Muvumboko neighbourhood pic.twitter.com/oCY2qplWKH
— Nicolas Niarchos (@PerneInAGyre) March 25, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..