Davos: సీఎం జగన్ బిజీబిజీ.. కరోనా పరిస్థితులపై అంతర్జాతీయ వేదికపై వివరణ
దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్(CM Jagan) ప్యూచర్ ప్రూపింగ్ హెల్త్ సిస్టమ్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏపీలో కరోనా ఎదుర్కొన్న తీరును వివరించారు. కొవిడ్ టైమ్‌లో 44 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు. జ్వరంతో ఉన్నవాళ్లను....
దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్(CM Jagan) ప్యూచర్ ప్రూపింగ్ హెల్త్ సిస్టమ్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏపీలో కరోనా ఎదుర్కొన్న తీరును వివరించారు. కొవిడ్ టైమ్‌లో 44 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు. జ్వరంతో ఉన్నవాళ్లను గుర్తించి మహమ్మారిని కట్టడి చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ గురించి తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని వివరించారు. దావోస్(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్యారోగ్య వ్యవస్థలపై జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రాథమిక స్థాయిలో వైద్యారోగ్యం అందించేందుకు కృషిచేస్తున్నామని వివరించారు. రెండు వేలు జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. 30 వేల మందికి వైద్యం అందించేలా పీహెచ్సీలు ఏర్పాటు చేశాం. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించాం. వారికి అంబులెన్స్ అందుబాటులోనే ఉంటుంది. మండల పరిమాణం ఆధారంగా అందులో 4 నుంచి 5 గ్రామాల బాధ్యతలను వైద్యులకు అప్పగించాం. గ్రామాల్లో పర్యటన ద్వారా వైద్యులు కుటుంబ వైద్యులుగా మారుతారు. ఇదంతా ప్రివెంటివ్ కేర్‌లో భాగం. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కరోనా ను నియంత్రించగలిగామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ వేదికలో పేర్కొన్నారు.
44 సార్లు ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేపట్టాం. దేశంతో పోలిస్తే ఏపీలో మరణాల రేటు అతితక్కువ. రాష్ట్రంలో గ్రామ, మండల స్థాయిలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. కానీ వైద్యారోగ్య సేవల మెరుగుదలకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం 11 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. కొత్త వైద్యులను తయారుచేసేందుకు వీలుగా మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నా.
– ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
కాలుష్యం లేని ఇంధనం, పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Vishnu Manchu and Genelia: ‘ఢీ’ సినిమా రోజులు గుర్తు చేసుకున్న విష్ణు, జెనీలియా..
Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. చిక్కింది ఏంటో చూసి జాలర్లు కళ్లు తేలేసారు!