Russia Ukraine War: విశ్వాసం అంటే ఇదే..! ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న రష్యా శునకం.. నెట్టింట వైరల్
మూడేళ్ల బెల్జియన్ మలినోయిస్ శునకాన్ని రష్యా సైనికులు విడిచిపెట్టారు. ఒంటరిగా ఉన్న ఈ కుక్క బక్కచిక్కి ఉక్రెయిన్ సైనికుల కంటపడింది. అనారోగ్యంతో ఉన్న ఆ కుక్కను సైనికులు చేరదీసి సపర్యలు చేశారు.

Russian Dog Help Ukraine: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండు నెలలుగా భీకరంగా కొనసాగుతోంది. రష్యా దాష్టీకాన్ని ఉక్రెయిన్ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వేలాది మంది మరణించగా.. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతోపాటు రష్యా సైనికులు ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో.. రష్యాకు చెందిన ఓ శునకం వార్తల్లో నిలిచింది. రష్యా దురాఘతాన్ని పసిగట్టిన శునకం.. ఉక్రెయిన్‌కు సాయం చేస్తూ.. వార్తల్లో నిలించింది. మూడేళ్ల బెల్జియన్ మలినోయిస్ శునకాన్ని రష్యా సైనికులు విడిచిపెట్టారు. ఒంటరిగా ఉన్న ఈ కుక్క బక్కచిక్కి ఉక్రెయిన్ సైనికుల కంటపడింది. అనారోగ్యంతో ఉన్న ఆ కుక్కను సైనికులు చేరదీసి సపర్యలు చేశారు. ప్రస్తుతం కోలుకున్న ఆ శునకం.. రష్యా వేసే ఎత్తుగడలను చిత్తు చేస్తూ.. ఉక్రేనియన్ సైనికులకు చేదోడువాదోడు నిలుస్తోంది.
ఉక్రేనియన్‌లో ఉన్న రష్యన్ కుక్క (మాక్స్) పేలని మందుపాతరలను పసిగడుతూ ఉక్రేయిన్ దళాలకు సహాయం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నల్ల సముద్రం సమీపంలోని ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మాక్స్ రష్యన్ దళాలతో కలిసి ఉండేది.. అయితే.. సైనికులు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు అది వెనుకబడిపోయింది. వారితో వెళ్లలేదు. ఈ క్రమంలో మైకోలైవ్ ప్రాంతంలో ఉక్రేనియన్ దళాలకు మాక్స్ దొరికింది.
ఈ సమయంలో అది మరణానికి దగ్గరగా ఉంది. అప్పటివరకు ఏదో ఒకవిధంగా జీవించిందని ఉక్రెయిన్ సైనికులు తెలిపారు. ఆ తర్వాత దానికి సపర్యలు చేయడంతో బాగా కోలుకుందని.. ఇప్పుడు ఉక్రేనియన్ దళాలకు మందుపాతరలను కనుగొనడంలో సహాయం చేస్తుందని అధికారులు తెలిపారు.




మాక్స్ ఫొటోలను, కథను ఉక్రెయిన్ నేషనల్ గార్డ్ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. మాక్స్ పూర్తి ఆరోగ్యంతో ఉందని.. దానికి అన్ని తెలుసని పేర్కొన్నారు. ప్రస్తుతం దానికి ఉక్రేనియన్ భాషా తరగతులు ప్రారంభమైనట్లు నేషనల్ గార్డ్ ఫైటర్ డిమిత్రో చెప్పారు. ఈ శునకం.. ఉక్రెయిన్‌ను సమర్థిస్తూ.. రష్యన్ సైనికులను కట్టడి చేస్తుందని డిమిత్రో చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
