కాలం మారింది గురూ..! ఆన్ లైన్ లో పెళ్లి.. 70mm స్క్రీన్‌ ముందు కూర్చుని కన్యాదానం చేసిన వధువు తల్లిదండ్రులు

సాధారణంగా పెళ్లిళ్లు ఫంక్షన్‌ హాళ్లలోనో.. గుళ్లలోనే జరుగుతాయి. కాని నెల్లూరులో ఏకంగా సినిమా థియేటర్లోనే జరిగింది. అది కూడా 70 ఎం ఎం స్క్రీన్‌పై. ఎందుకంటే..

కాలం మారింది గురూ..! ఆన్ లైన్ లో పెళ్లి.. 70mm స్క్రీన్‌ ముందు కూర్చుని కన్యాదానం చేసిన వధువు తల్లిదండ్రులు
Online Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2022 | 3:17 PM

సాధారణంగా పెళ్లిళ్లు ఫంక్షన్‌ హాళ్లలోనో.. గుళ్లలోనే జరుగుతాయి. కాని నెల్లూరులో ఏకంగా సినిమా థియేటర్లోనే జరిగింది. అది కూడా 70 ఎం ఎం స్క్రీన్‌పై. ఎందుకంటే.. పెళ్లి జరిగింది అమెరికాలో.. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ పద్దతిలో భారీ స్క్రీన్‌పై తిలకించారు అమ్మాయి తరఫువారు. పలగాటి వారి పెళ్లి సందడి.. నూతన వధూవరులను ఆశీర్వదించాలి..అంటూ బంధుమిత్రులను ఎంతో ఆత్మీయంగా పెళ్లికి ఆహ్వానించారు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది..ఐతే అది ఇక్కడ కాదు. ఖండాంతరాల అవతల. వధూవరులు అమెరికాలో..తల్లిదండ్రులు ఆంధ్రాలో..కన్యాదానం నుంచి అప్పగింతల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే. ఐతే సప్తసముద్రాలు దాటి అమెరికాకు వెళ్లలేకపోయారు అమ్మాయి తల్లిదండ్రులు. కూతురి వివాహాన్ని కూడా 70mm స్క్రీన్‌పై చూసి ఆనందించడం తప్పం ఇంకేం చేయలేని పరిస్థితి వారిది.

Online

Online

నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులు రెడ్డి, సునీల దంపతుల బిడ్డ రిషితకు.. అమెరికాలో స్థిరపడిన పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు రోహిత్‌రెడ్డితో వివాహం నిశ్చయించారు. అమెరికాలో పెళ్లి చేసేందుకు గ్రాండ్‌గా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. ఈ నెల 21న పెళ్లి ముహూర్తం. అంటే మన టైమ్‌లో 22న మ్యారేజ్‌. అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం అప్లై చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ వారికి వీసా మంజూరు కాలేదు. చేసేదేం లేక చివరికి కుమార్తె పెళ్లి వేడుక చూసేందుకు తిరుపతిలోని బాహుబలి థియేటర్‌ను బుక్‌ చేసుకున్నారు. బంధుమిత్రులను బాహుబలి థియేటర్‌కే ఆహ్వానించారు.

బంధుమిత్రులతో కలిసి కూతురి పెళ్లిని ఎంతో వేడుకగా చేయాల్సిన తల్లిదండ్రులు..ఇలా ఏదో మూవీలో పెళ్లిని చూసినట్టు 70mm స్క్రీన్‌పైనే చూసి సంతోషపడ్డారు. అమెరికాలో కూతురి మెడలో మాంగల్యధారణ జరుగుతుంటే..స్క్రీన్‌పైనే అక్షింతలు వేసి కూతురిని, అల్లుడిని దీవించి సంతృప్తి చెందారు. కల్యాణమండపంలో అన్నీ తానై పెళ్లి తతంగంమంతా దగ్గరుండి చూడాల్సిన తండ్రి ..ఇలా స్క్రీన్‌ ముందు కూర్చుని చూడాల్సివస్తోందంటున్నారు పెళ్లికొచ్చిన అతిథులు.

ఇవి కూడా చదవండి