Sri Lanka: రాబోయే రోజుల్లో మరణాలూ తప్పవు.. ఎమర్జెన్సీ సర్జరీల వాయిదాతో దయనీయంగా పరిస్థితి
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక (Sri Lanka) లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశాన్ని ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఆ దేశంలో....
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక (Sri Lanka) లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న సింహళ దేశాన్ని ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఆ దేశంలో ఔషధాల కొరత ఏర్పడింది. దీంతో ఎమర్జెన్సీ సర్జరీలను వైద్యులు వాయిదా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరణాలూ తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఔషధాల(Medicines shortage) సరఫరా కోసం శ్రీలంక విదేశాలపై ఆధారపడుతోంది. విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోతుండటంతో ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ రోగులకు ఇంజెక్షన్లు, క్యాన్సర్ ఔషధాలు కూడా అందుబాటులో లేవన్నారు. దీంతో ఆయా రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఔషధ సాయం చేసేందుకు భారత్, జపాన్ లాంటి దేశాలు ముందుకొచ్చినప్పటికీ అవి దేశానికి వచ్చేందుకు నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.
పెట్రోల్, వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో నిల్చున్నట్లు కాదు.. ఔషధాల కొరత పరిస్థితి. చికిత్స ఆలస్యమైతే రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఓ వైద్యుడు ఆవేదన చెందారు. మందుల కోసం రోగులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తే వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు.. దేశంలో రెండు వారాల క్రితం విధించిన ఎమర్జెన్సీని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం ప్రకటన విడుదల చేసింది. రెండు వారాల క్రితం శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రెండోసారి అత్యయిక పరిస్థితి విధించారు.
గతంలో నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చేలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు గాయపడ్డారు. శ్రీలంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. నిరసనకారుల ఆందోళనతో ఆదేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
PM Modi: టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో