AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardiac Deaths: ఆ సంవత్సరానికి గుండెపోటు మరణాల్లో భారత్‌ నెంబర్‌ వన్‌.. హెచ్చరిస్తున్న కార్డియాలజిస్ట్‌!

Cardiac Deaths: ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి, తినే ఆహారం తదితర కారణాల మనిషి వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. ఈ..

Cardiac Deaths: ఆ సంవత్సరానికి గుండెపోటు మరణాల్లో భారత్‌ నెంబర్‌ వన్‌.. హెచ్చరిస్తున్న కార్డియాలజిస్ట్‌!
Subhash Goud
|

Updated on: May 23, 2022 | 2:33 PM

Share

Cardiac Deaths: ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి, తినే ఆహారం తదితర కారణాల మనిషి వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో గుండెపోటు (Heart Attack) సమస్యలు, మరణాలు కూడా ఎక్కువగానే అవుతున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి రోజు వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల గుండెను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో2030 నాటికి గుండెపోటు మరణాల్లో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలుస్తుందని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సీఎస్‌ మంజునాథ్‌ చెబుతున్నారు. యువత, మధ్య వయస్కులలో గుండె సంబంధిత సమస్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. డాక్టర్‌ సీఎస్‌ మంజూనాథ్‌ జయదేవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌. ఆయన ‘హెల్తీ మెడికాన్‌-2022’ అనే అంశంపై హెచ్‌ఏఎల్‌ వైద్యులకు సంబంధించిన జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

గుండెపోటు ఎప్పుడు వస్తుంది ?

గుండెపోటు రావడానికి కారణాలను వివరించారు. శరీరంలోని సిరల్లో రక్తప్రసరణ సజావుగా సాగనప్పుడు రక్తం గడ్డకట్టడం ప్రారంభం అవుతుంది. దీని కారణంగా రక్తం గుండెకు సరఫరా కాదు. అలాంటి సమయంలో గుండెకు ఆక్సిజన్‌ అందడం అనేది ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు వస్తుంది. గుండెపోటు కొన్ని సందర్భాలలో ప్రాణాంతంగా మారే ప్రమాదం ఉంది. తక్షణమే చికిత్స అందించినట్లయితే రోగిని రక్షించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తీవ్రతరం అవుతున్న వాయు కాలుష్యం:

దేశంలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతోంది. దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికన్‌ వాయు కాలుష్యానికి గురైన గంటలోనే ఓ వ్యక్తి గుండెపోటుకు గురవుతాడు. రోడ్లపై తిరిగే వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, నిర్మాణ ప్రాంతాలపై వచ్చే దుమ్ము ధూళితో గాలిలో కాలుష్యం ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి