- Telugu News Photo Gallery Know these are the amazing benefits of fennel milk check here details in telugu
Ayurvedic Tips: వేడి పాలలో చిటికెడు సోంపు కలిపి తాగితే ఈ సమస్యలు దూరం.. ఈ లాభాలు మీకు తెలుసా..
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని అంటుంటారు నిపుణులు. పాలలో కాల్షియంతోపాటు పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు సోంపు కలుపుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: May 23, 2022 | 10:10 AM

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని అంటుంటారు నిపుణులు. పాలలో కాల్షియంతోపాటు పోషకాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు సోంపు కలుపుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

సాధారణంగా చాలా మంది జీర్ణ సమస్యలు వస్తాయని పాలు తీసుకోరు.. అయితే లాక్టోస్, ఇన్ టాలరెన్స్ సమస్య లేకపోతే పాలలో చిటికెడు సోంపు కలుపుకుని తాగవచ్చు. సోంపులో ఉండే చల్లని, తీపి గుణాల కారణంగా ఈ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సోంపును పాలల్లో కలిపి తాగాలి. సోంపు పాలలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ ఉంటాయి. ఈ పదార్థఆలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మోనోపాజ్ సమయంలో మహిళల్లో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ సమయంలో వారు సోంపు పాలు తాగితే మంచిది. సోంపులో ఉండే ఐరన్, పొటాషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహయపడతాయి.

సోపులో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనికి తోడు మెంతికూర కలిపిన పాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

పాలు వేడిచేస్తున్న సమయంలోనే అందులో 1/2 టీస్పూన్ ఫెన్నెల్ కలపాలి. ఆ తర్వాత పాలను సోంపుతో మరిగించాలి. పాలు చల్లారిన తర్వాత అందులో తేనె మిక్స్ చేసి కలిపి తీసుకోవాలి.

Ayurvedic Tips: వేడి పాలలో చిటికెడు సోంపు కలిపి తాగితే ఈ సమస్యలు దూరం.. ఈ లాభాలు మీకు తెలుసా..