Fish Health Benefits: చేపలు ఎక్కువగా తింటే వీటికి చెక్‌ పెట్టొచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు..!

Fish Health Benefits: కొన్ని ఆహారాలను తరుచుగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వచ్చే వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేపలు తినడం వల్ల ఎన్నో..

Fish Health Benefits: చేపలు ఎక్కువగా తింటే వీటికి చెక్‌ పెట్టొచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు..!
Follow us

|

Updated on: May 22, 2022 | 1:00 PM

Fish Health Benefits: కొన్ని ఆహారాలను తరుచుగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వచ్చే వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేపలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. చేపల పులుసే కాదు చేపల వేపుడు కూడా అద్భుతంగా ఉంటుందని, ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయినా తినడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలతో మానసిక ఆందోళన తగ్గింపు: చేపలతో మానసిక ఆందోళన తగ్గుతుందని, ప్రతి రోజు ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. గొంత క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌ ఇతర రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

  1. మతిమరుపు సమస్యలకు చెక్‌: చాలా మందికి మతిమరుపు సమస్య ఉంటుంది. గతంలో వయసు మీద పడుతున్నవారికి మాత్రమే మతిమరుపు సమస్య ఉండేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మధ్య వయసు నుంచే మతిమరుపు సమస్య వెంటాడుతోంది. కొందరికి తీవ్రమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంటుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్నవారికి చేపలు తినడం వల్ల ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఈ విషయం 2016లో అమెరికన్‌ శాస్త్రవేత్తలు పలు పరిశోధనల ద్వారా గుర్తించారు. అంతేకాకుండా చేపలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు.
  2. గుండె జబ్బులు: చేపలు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. చేపలు అధికంగా తినే వారిలో గుండె సమస్యలు రావని అమెరికన్‌ జర్నల్‌ ఆప్‌ కార్డియాలజీలో ఓ అధ్యయనం ద్వారా తేలింది. చేపలలో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా కాపాడుతాయి.
  3. స్త్రీల సమస్యకు: స్త్రీలలో రుతుక్రమం సమస్యకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చేపలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు తరచుగా చేపలు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
  4. చేపలలో మరికొన్ని పోషకాలు: చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. చేపలతో జ్ఞాపకశక్తి పెంపు: చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.
  7. చేపల్లో బీ12 విటమిన్‌: చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి. సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు. దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!