AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: రోజూ టీలో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.. అవెంటో తెలుసుకోండి..

బరువు తగ్గాలనుకునేవారు.. రోజూ టీలో పంచదారకు బదులుగా కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతాయి.

Weight Loss: రోజూ టీలో ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.. అవెంటో తెలుసుకోండి..
Tea
Rajitha Chanti
|

Updated on: May 22, 2022 | 1:57 PM

Share

ప్రస్తుతం ఆధునిక కాలంలో ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.. ఈ పరిస్థితులలో చక్కెరను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. భారతదేశంలో చాలా మంది ప్రజలు ఉదయాన్నే ముందుగా టీ తాగుతారు. మన దేశంలో చాయ్ ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. బరువు తగ్గాలనుకునేవారు.. రోజూ టీలో పంచదారకు బదులుగా కొన్ని పదార్థాలను కలిపి తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతాయి. అంతేకాదండోయ్.. చక్కెర లేని టీ తాగడం వలన డయాబెటిక్ రోగులలో షుగర్ లెవల్స్ తగ్గడమే కాకుండా.. బరువు కూడా తగ్గుతారు.. ఈ పదార్థాలను టీలో కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంతోపాటు.. టీ రుచిని పెంచుతాయి. అందుకే రోజూ టీతోపాటు ఏఏ పదార్థాలు కలిపి తీసుకుంటే మంచిదో తెలుసుకుందామా.

తేనె..

ఉదయాన్నే టీలోచక్కెరకు బదులుగా తేనెను కలుపుకోండి.. కానీ టీ లో తేనె వేసి మరిగించవద్దు.. ముందుగా చక్కెర లేకుండా టీ తయారు చేసుకోవాలి.. ఆ తర్వాత కప్ లో అవసరానికి అనుగణంగా తేనె కలుపుకోవాలి.. ఇది టీలో కరిగిపోవడానికి కొంత సమయం పడుతుంది. టీలో తేనెను కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.

బెల్లం..

బరువు తగ్గేందుకు డైట్ చేస్తున్నవారు రోజూ టీలో చక్కెరకు బదులుగా బెల్లం వాడండి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహయపడతాయి. బెల్లం టీ తయారు చేసేటప్పుడు బెల్లం ఎక్కువగా వేయకూడదు.. దీంతోపాటు.. టీ మరిగన తర్వాత బెల్లం కలపాలి. టీ మరుగుతున్న సమయంలో బెల్లం కలపాలి..

ఖర్జూరం సిరప్..

ఖర్జూరం సిరప్ చాలా తీపిగా.. రుచిగా ఉంటుంది.. దీనిని టీలో ఉపయోగిస్తే పరిమాణాన్ని గుర్తుంచుకోవాలి.. బ్లాక్ టీ తాగితే అందులో ఈ సిరప్ వేసి తాగాలి. ఇది రుచికి.. ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాగే బరువును కూడా తగ్గిస్తుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. వీటిని అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..