Telangana: అక్కడి గుట్టల్లో క్షుద్రపూజలు, విగ్రహాల కింద తవ్వకాలు..12 లంకెబిందెలు మాయం!!

గుప్తనిధుల కోసం విగ్రహాలను మాయం చేసి తవ్వకాలు చేపట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. ఒకటి కాదు రెండు కాదు...... మూడు విగ్రహాలను మాయం చేసి, విగ్రహాల కింద ఉన్న లంకె బిందెలను ఎత్తుకెళ్లిన

Telangana: అక్కడి గుట్టల్లో క్షుద్రపూజలు, విగ్రహాల కింద తవ్వకాలు..12 లంకెబిందెలు మాయం!!
Peddapalli
Follow us

|

Updated on: May 23, 2022 | 2:05 PM

గుప్తనిధుల కోసం విగ్రహాలను మాయం చేసి తవ్వకాలు చేపట్టారు గుర్తుతెలియని వ్యక్తులు. ఒకటి కాదు రెండు కాదు…… మూడు విగ్రహాలను మాయం చేసి, విగ్రహాల కింద ఉన్న లంకె బిందెలను ఎత్తుకెళ్లిన విషయం ఆ ఊళ్లో దావానంలా పాకింది. పాండవుల విగ్రహాలను తొలగించిన గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆ తవ్విన చోట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలను సైతం నిర్వహించారు. తవ్వకాలు జరిపిన వ్యక్తులను పట్టుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామ శివారులోని పంచ పాండవుల గుట్ట దగ్గర పురాతన కాలం నాటి విగ్రహాలను తొలగించి, వాటి కింద ఉన్న నిధులు, పన్నెండు లంకె బిందెలు ఎత్తుకెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పాండవుల విగ్రహాలను గతంలో కూడా గుప్తనిధుల కోసం ఇదే ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. గతంలో కూడా ఈ విగ్రహాలను తొలగించేందుకు కొంతమంది తవ్వకాలు చేపట్టారు. ఏం జరిగిందో ఏమో కానీ జేసీబీ కాలిపోయింది…డ్రైవర్ కూడా చనిపోయాడని ప్రచారం జరిగింది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గుప్తనిధుల కోసం తిరిగి తవ్వకాలు చేపట్టి విగ్రహాలను కూడా ఎత్తుకెళ్లారు దుండగులు.

ఇవి కూడా చదవండి

గుప్తనిధుల కోసం JCBతో తవ్వకాలు చేపట్టినట్టు ఆనవాళ్లు కనబడుతున్నాయి. పక్కనే ఉన్న మరో విగ్రహం పక్కకు నెట్టే క్రమంలో ఆ విగ్రహం విరిగిపోయింది. సుమారు ఆరు ఫీట్ల లోతు గోతిని తవ్వారు,పన్నెండు లంకెబిందెలో బంగారు నాణాలు లభ్యమయ్యాయని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. విగ్రహాల వద్ద కొత్త బట్టలు, దీపాలు, కోడిని బలిచ్చిన ఆనవాళ్లు కూడా దర్శనమిచ్చాయి. ఈ ప్రాంతవాసుల సహాయంతోనే గుప్త నిధుల తవ్వకాలు చేపట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత పోలీసు అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.