Dogs Birthday: పెంపుడు ‘టైగర్‌’ బర్త్‌డే..ఇళ్లంతా సందడే సందడి, ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్‌

Dogs Birthday:  పిల్లల పుట్టినరోజున అన్నదానం, బట్టలు దానం, పుస్తకాలు పంపిణీ చేసే తల్లిదండ్రులను చూశాం. కానీ కొందరు జంతుప్రేమికులు పెంపుడు జంతువులకు కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు...

Dogs Birthday: పెంపుడు 'టైగర్‌' బర్త్‌డే..ఇళ్లంతా సందడే సందడి, ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్‌
Dog
Follow us
Jyothi Gadda

| Edited By: Narender Vaitla

Updated on: May 22, 2022 | 10:13 PM

Dogs Birthday:  పిల్లల పుట్టినరోజున అన్నదానం, బట్టలు దానం, పుస్తకాలు పంపిణీ చేసే తల్లిదండ్రులను చూశాం. కానీ కొందరు జంతుప్రేమికులు పెంపుడు జంతువులకు కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా భోథ్‌ మండలంలోని సోనాల గ్రామంలో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది. దాంతో ఆఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

గతంలో ఓ కుటుంబం ఒక పెంపుడు కోడి పుంజుకు పుట్టిన రోజు నిర్వహించిన ఘటన నెట్టింట హల్‌చల్‌ చేసింది. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోడికి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. ఒక యువతి చేతిలోని కోడి కాళ్లతో పెద్ద కేక్‌ను కూడా కట్‌ చేయించారు. చిన్న కేక్‌ ముక్కను దానికి తినిపించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా హ్యాపీ బర్త్‌ డే సాంగ్‌ పాడారు. అనంతరం అంతా కోడి బర్త్‌ డేని ఎంజాయ్‌ చేశారు. అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కోడికి బర్త్‌ డే వేడుక జరుపడాన్ని కొందరు నెటిజన్లు స్వాగతించారు. అయితే చాలా మంది ఆ కోడిపై పలు రకాలుగా జోకులు వేస్తూ కామెంట్లు చేశారు.

తాజాగా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని సోనాల గ్రామానికి చెందిన క్రిష్ణపాల్ సింగ్ కి చెందిన పెంపుడు కుక్కపేరు టైగర్‌. ఇంటిల్లిపాది టైగర్‌ని ఎంతో అప్యాయంగా చూసుకునేవారు. ఈ క్రమంలోనే ఇంట్లోని సభ్యుల మాదిరిగానే టైగర్‌కి పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. టైగర్ ఫస్ట్‌ బర్త్‌డే సందర్భంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కుటుంబ సభ్యులు. వీడియోలు ఫోటోలు చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.