viral video: ఫిట్‌నెస్‌లో అమ్మమ్మకు మనవడి ఛాలెంజ్..ఇట్టే ఎత్తిపడేసిన బామ్మ సత్తాకు నెటిజన్లు ఫిదా
వృద్ధాప్యంలో ఇంట్లో ఉండకూడదని, కేవలం ఆధ్యాత్మికత వైపు, భగవంతుని విషయాలవైపు మళ్లి, మిగతా విషయాల నుంచి విరమించుకోవాలని చెప్పే నేటి వ్యవస్థ మనది. కానీ వయస్సు శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందని, మనస్సు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటుందని
వృద్ధాప్యంలో ఇంట్లో ఉండకూడదని, కేవలం ఆధ్యాత్మికత వైపు, భగవంతుని విషయాలవైపు మళ్లి, మిగతా విషయాల నుంచి విరమించుకోవాలని చెప్పే నేటి వ్యవస్థ మనది. కానీ వయస్సు శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందని, మనస్సు ఎల్లప్పుడూ మానసిక ఆరోగ్యంతో ఉంటుందని వారు చేసే కొన్ని కొన్ని పనులను చూస్తే అర్థం అవుతుంది..ఎవరూ ఊహించని, వారికి అసాధ్యం అనుకున్న పనులను చేస్తున్న అమ్మమ్మలు, తాతలు చాలా మంది ఉన్నారు. సీనియర్‌ల ఇలాంటి సరదా వీడియోలను చూడటం అనేది సోషల్ మీడియాలో దొరికే గొప్ప ఆనందాలలో ఒకటి. ఇతరులకు కూడా స్ఫూర్తినిచ్చే, ఉత్తేజపరిచే ఇలాంటి వీడియోలను మనం చాలా చూశాము. అలాంటి వీడియో ఇక్కడ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వీడియోలో ఎనభై ఏళ్ల వయసున్న ఓ బామ్మ చేస్తున్న స్టంట్స్ చూడొచ్చు..ఆమె తన మనవడు ‘ఛాలెంజ్’ వేయగా.. అమ్మమ్మ దాన్ని స్వీకరించి తేలిగ్గా చేసింది. వర్కవుట్లలో కాస్త భారీ అనుకున్న డెడ్ లిఫ్ట్ చేసి చూపించడమే మనవడి ఛాలెంజ్.. బామ్మ గారు దాన్ని చాలా సింపుల్ గా చేసారు. దీంతో ఈ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది. ఇది చూసిన యువకులంతా ఏం మాస్ మామ్మరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో punjabi_industry అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. సోషల్ మీడియా యూజర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నఈ వీడియోలో 80ఏళ్ల అమ్మమ్మ భారీ కసరత్తు చేస్తోంది. అతి బరువైన ఎక్సర్‌సైజ్ సాధనాన్ని అతిసులువుగా ఎత్తేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంటర్ నెట్‌లో చేరిన ఈ వీడియో నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మమ్మ చేసిన స్టంట్స్‌కు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
ఏది ఏమైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఇంట్లోని పెద్దల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. గుండె జబ్బులున్న వారితో పాటు ఏదైనా జబ్బుతో చికిత్స పొందుతున్న వారికి, డిస్క్ సమస్య ఉన్నవారికి ఈ తరహా ‘ఛాలెంజ్’ చేయకండి. అంటూ మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.