AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లిపీటల మీద బయటపడిన రహస్యం.. కట్ చేస్తే మ్యారేజ్ క్యాన్సిల్.. అసలు సంగతి తెలిస్తే షాకే!

మన అమ్మ,నాన్నల పెళ్లిజరిగిన రోజుల్లో అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకునేవారు కాదట. ఇంట్లోని పెద్దలే పిల్లల పెండ్లి విషయాలు చర్చించుకుని ఏకంగా పెళ్లి చేసేవారట. ఇక పెళ్లి కూతురికి అబ్బాయి నచ్చకపోయినా,

Viral: పెళ్లిపీటల మీద బయటపడిన రహస్యం.. కట్ చేస్తే మ్యారేజ్ క్యాన్సిల్.. అసలు సంగతి తెలిస్తే షాకే!
Bride
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: May 23, 2022 | 12:53 PM

Share

మన అమ్మ,నాన్నల పెళ్లిజరిగిన రోజుల్లో అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకునేవారు కాదట. ఇంట్లోని పెద్దలే పిల్లల పెండ్లి విషయాలు చర్చించుకుని ఏకంగా పెళ్లి చేసేవారట. ఇక పెళ్లి కూతురికి అబ్బాయి నచ్చకపోయినా, వరుడికి అమ్మాయి నచ్చక పోయినా ఎవరూ నోరు మెదిపి బయటకు చెప్పేవారు కాదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లి విషయంలో అస్సలు మాట్లాడేవారు కాదట. కానీ, నేటి తరం పెళ్లిళ్లు అలా కాదు..పెళ్లి కొడుకు నచ్చకపోయినా వధువు మౌనంగా తలవంచుకుని తాళి కట్టించుకునే రోజులు పోయాయి. అబ్బాయి నచ్చకపోతే కరాఖండీగా చెప్పేస్తున్నారు ఈతరం అమ్మాయిలు. తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన పనితో మండపం వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడంతో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంది వధువు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ విషయం ఎలా తెలిసిందంటే…

యూపీలోని ఉన్నావ్‌లో పెళ్లి తంతు జరుగుతోంది. వరుడు మండపంలోకి వెళ్లేలోపే కాస్త నలతగా ఉండటంతో తల తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. అతను నేలపై పడిపోవడంతో, అతని విగ్ ఊడిపోయి బయటపడింది. దాంతో వరుడి బట్టతల బాగోతాన్ని అందరూ చూశారు. వధువు సహా బంధువులు, కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పెండ్లి కూతురు బట్టతల ఉన్న వ్యక్తితో తనకు పెండ్లి వద్దంటే వద్దని భీష్మించుకుంది. చివరికి పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చినా కూడా ఆ అమ్మాయి పెండ్లికి ససేమిరా అన్నది. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరుపగా, పెండ్లి కోసం అమ్మాయి తండ్రి ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు తిరిగి ఇవ్వాలని తీర్మానం చేశారు. దాంతో ఇక చేసేది లేక అబ్బాయి తరఫు వారు అంగీకరించి డబ్బు వాపాస్‌ ఇచ్చేశారు.