AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Celebration: వేప చెట్టుకు వందేళ్ల పండగ..ఏడాదిపాటు ఊరంతా వేడుక! వృక్ష ప్రేమికుల అభిమానం

పది, ఇరవై కాదు ఏకంగా ఆ చెట్టు వందేళ్ళు పూర్తి చేసుకుంది... దీంతో వృక్ష ప్రేమికుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శతాధిక వృద్దులకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నప్పుడు చెట్టుకు మాత్రం ఎందుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని ఆ ఊరి ప్రజలు అనుకున్నారు.

Birthday Celebration: వేప చెట్టుకు వందేళ్ల పండగ..ఏడాదిపాటు ఊరంతా వేడుక! వృక్ష ప్రేమికుల అభిమానం
Neem Tree's
Jyothi Gadda
|

Updated on: May 23, 2022 | 9:43 AM

Share

పది, ఇరవై కాదు ఏకంగా ఆ చెట్టు వందేళ్ళు పూర్తి చేసుకుంది… దీంతో వృక్ష ప్రేమికుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శతాధిక వృద్దులకు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నప్పుడు చెట్టుకు మాత్రం ఎందుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించకూడదని ఆ ఊరి ప్రజలు అనుకున్నారు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

బాపట్ల జిల్లా నగరం మండలం దూళిపూడిలోని శ్రీ రాజగోపాలస్వామి దేవాలయం ఎదుట నూతి సత్యన్నారాయణ 1923 మే 21న వేప చెట్టు నాటారు. అంతేకాకుండా అప్పట్లో యాభై రూపాయలు వెచ్చించి చెట్టు చుట్టూ రచ్చ బండ కూడా కట్టించారు. దీంతో చెట్టు చుట్టూ కట్టించిన రచ్చబండను రికార్డుల్లోకి కెక్కించారు. అప్పటి నుండి స్థానికులు ఆ చెట్టును లక్ష్మీ దేవిగా భావించి పూజలు చేయడం మొదలు పెట్టారు‌.

చెట్టు నాటిన నూతి సత్యన్నారాయణ కాలం చేసినా, ఆయన వారసులు చెట్టు నాటి వందేళ్ళు అయినట్లు గుర్తించి శత వసంతాల వేడుక నిర్వహించారు. ఏడాది పాటు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలని కూడా నిర్ణయించారు సత్యన్నారాయణ వారసులు వెంకటరామ శర్మ, శివ ప్రసాద్, సాయి బాబు. గ్రామస్థులు వారికి మద్దతివ్వడంతో ఆ చెట్టు వందేళ్ళ వేడుకలు ఘనంగానే జరుగుతున్నాయి‌. అయితే, ఈ వేడుకలు ఎలా జరుగుతున్నాయంటే..

Birthday' Celebrated

Birthday’ Celebrated

అమ్మవారి ప్రతిరూపంగా భావించే వేప చెట్టుకు కొత్త చీర కట్టారు. పొంగలి వండి నైవేద్యం పెట్టారు. చెట్టు చుట్టూ ఉన్న రచ్చబండకు కొత్త సొగబులు అద్దారు. అంతేకాదండోయ్‌.. ఊరంతా వచ్చి వేప చెట్టుకి ప్రత్యేక పూజలు చేశారు. ఆ విధంగా వందేళ్ళ వేడుకలను పూర్తి చేశారు. ఈ వేడుకలను చూసేందుకు దూళిపూడివాసులతో పాటు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..