Harish rao: కొండాపూర్ ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీలు.. డాక్టర్ పై సస్పెన్షన్ వేటు..మరో కీలక నిర్ణయం!
తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు (minister harish rao) కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో
తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు (minister harish rao) కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఆకస్మీక పర్యటనకు వచ్చారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సదరు డాక్టర్ మూర్తిపై అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేశారు మంత్రి హరీష్ రావు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్నారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే, కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రి అన్ని విభాగాలను సందర్శించిన మంత్రి పలువురు వైద్యులకు పలు కీలక సూచనలు చేశారు. గైనకాలజీ వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని చెప్పారు. అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి పంపుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. 60శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నార్మల్ డెలివరీలను ఇంకా పెంచాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి అంతటా తిరుగుతూ..వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.