AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja Smuggling: తూర్పు గోదావరి ఏజెన్సీ టు హైదరాబాద్‌ గంజాయి స్మగ్లింగ్‌.. పది మంది గ్యాంగ్‌లో ఇద్దరు యువతులు..

భారీగా పట్టుబడ్డ గంజాయి ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. తూర్పు గోదావరి ఏజెన్సీ ఏరియా నుండి పది మంది మెంబర్స్‌ గల ముఠా హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తోంది. ఈసమాచారం అందుకున్న పోలీసులు హయత్‌నగర్‌ దగ్గర వారిని పట్టుకున్నారు. ఈ ముఠాలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర..

Ganja Smuggling: తూర్పు గోదావరి ఏజెన్సీ టు హైదరాబాద్‌ గంజాయి స్మగ్లింగ్‌.. పది మంది గ్యాంగ్‌లో ఇద్దరు యువతులు..
Ganjai
Sanjay Kasula
|

Updated on: May 23, 2022 | 12:27 PM

Share

ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు గుట్టు చప్పుడు గంజాయి అక్రమ రవాణా అవుతోంది. హైదరాబాద్‌- విజయవాడ హైవే గంజాయి రవాణా కారిడార్‌గా మారింది. పెద్ద అంబర్‌పేట దగ్గర మరోసారి భారీగా పట్టుబడ్డ గంజాయి(Ganja) ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. తూర్పు గోదావరి ఏజెన్సీ ఏరియా నుండి పది మంది మెంబర్స్‌ గల ముఠా హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తోంది. ఈసమాచారం అందుకున్న పోలీసులు హయత్‌నగర్‌ దగ్గర వారిని పట్టుకున్నారు. ఈ ముఠాలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ఓ కారులో నుంచి గంజాయి ప్యాకెట్లు మరో కారులోకి మారుస్తుండగా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 470 కిలోల గంజాయి, నాలుగు కార్లు, రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వీరి ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నారు? ఈ గంజాయి సిటీలో ఎక్కడెక్కడ అమ్ముతున్నారు? వీరి ఏజెంట్లు ఎవరు? అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

నాలుగు రోజుల క్రితమే గంజాయి తరలింపులో ఓ మాయగాడు మాయలు వెలుగులోకివచ్చిన సంగతి తెలిసిందే..  చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి నింపి.. హోమ్ డెలివరీ చేయడం ఇతడి స్పెషాలిటీ.  ఒక్కో ప్యాక్‌లో 15 గ్రాముల గంజాయి నింపుతాడు. ఒక్కో ప్యాక్‌ ధర 4 వందల నుంచి 6వందలు. ఫిక్స్‌డ్‌ రేటేం కాదు. డిమాండ్‌ను బట్టీ పైసా వసూల్‌ చేస్తుంటాడు మురుగేష్‌. స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా వుంటాయి. సిగరెట్‌ గంజాయికి ఎక్స్‌ట్రా రేటు. ధూల్‌పేట(Dhoolpet) అడ్డాగా కొన్నాళ్లుగా మురుగేషన్‌ గంజాయి దందాలో ఆరితేరాడు.

పలుమార్లు పోలీసులకు పట్టుపట్టాడు. కేసులు కూడా ఫైలయ్యాయి. బండి కూడా పోయింది. ఐనా సరే దందాను మాత్రం మారలేదు. సొంత బండి వాడితే ఖాకీలకు చిక్కక తప్పదని ఖతర్నాక్‌ ఐడియా వేశాడు. సులభం..సురక్షితంగా..తక్కువ ధరతో గమ్యస్థానానికి చేర్చేలా అందుబాటులోకి వచ్చిన టూవీలర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ను బాగా వాడేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ వార్తల కోసం..