Hyderabad: నీరజ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు.. హత్యకు ముందు మద్యం తాగిన నిందితులు
హైదరాబాద్(Hyderabad) బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. జుమేరాత్ బజార్‌లో....
హైదరాబాద్(Hyderabad) బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. జుమేరాత్ బజార్‌లో కత్తులు, రాడ్లు కొన్న నిందితులు.. పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ నిర్వహించారు. గత శనివారం బేగంబజార్‌లో నీరజ్ కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. నీరజ్ హత్యకు ముందు నిందితులు మద్యం తాగినట్టు దర్యాప్తులో తేలింది. నీరజ్ పర్వాన్ హత్యతో బేగంబజార్(Begum Bazar) దద్దరిల్లిపోయింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలతో అట్టుడికింది. నీరజ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వ్యాపారులు, స్థానికులంతా కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.భర్తను కోల్పోయిన సంజన కన్నీరుమున్నీరుగా విలపించింది. తన భర్తను చంపిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది సంజన. ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ హత్యపై హెచ్ఆర్సీ కూడా రియాక్టైంది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించింది. నీరజ్ పరువు మర్డర్‌పై జూన్ 30లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు మాత్రం సంజన బంధువులే ఈ హత్య చేశారని తేల్చారు. 15 రోజుల నుంచి మర్డర్ ప్లాన్ చేస్తున్నారని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
MLC Ananta Babu: అందుకే చంపాను.. పోలీసుల ముందు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు..