MLC Ananta Babu: అందుకే చంపాను.. పోలీసుల ముందు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు..

సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. వ్యక్తిగత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో చంపేశానని అంగీకరించారు. హత్యలో తానొక్కడినే పాల్గొన్నట్టు వెల్లడించారు. బాధిత కుటుంబం మొదటి నుంచి ఎమ్మెల్సీనే హంతకుడని ఆరోపించాయి. ఇప్పుడదే నిజమైంది.

MLC Ananta Babu: అందుకే చంపాను.. పోలీసుల ముందు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు..
Mlc Anantha Babu
Follow us

|

Updated on: May 23, 2022 | 2:06 PM

ఆందోళనలు.. ఒత్తిళ్ల మధ్య నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆఫీస్‌కు.. తన కారులోనే స్వయంగా వెళ్లి సరెండర్ అయ్యారు. హత్యకు సంబంధించిన వివరాలన్నీ డీఐజీకి వెల్లడించారు. కాసేపట్లో మేజిస్ట్రేట్‌ ఎదుట అనంతబాబును(Ananta Babu) హాజరుపరచనున్నారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. వ్యక్తిగత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో చంపేశానని అంగీకరించారు. హత్యలో తానొక్కడినే పాల్గొన్నట్టు వెల్లడించారు. బాధిత కుటుంబం మొదటి నుంచి ఎమ్మెల్సీనే హంతకుడని ఆరోపించాయి. ఇప్పుడదే నిజమైంది. పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ. అయితే.. రాత్రి వేళల్లో ఎంక్వైరీల పేరుతో టార్చర్‌ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుబ్రహ్మణ్యం సోదరుడు. అయితే ఈ ఘటనలో కొన్ని కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి.

సుబ్రహ్మణ్యం మర్డర్‌ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్‌. అప్పుడే నిజాలు బయటికొస్తాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు మామూలోడు కాదన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. ఎమ్మెల్సీ రహస్యాలు ఎక్కడ బయటపడతాయోనని అనుమానించి సుబ్రహ్మణ్యంను చంపాడని ఆరోపించారు. అయితే జరుగుతున్న రాద్దాంతానికి.. బాధిత కుటుంబం ఆలస్యంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వడమే కారణమన్నారు మంత్రి బొత్స. చట్టానికి ఎవరూ చుట్టం కాదన్నారు.

మరోవైపు.. కాకినాడలో వామపక్ష, ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆందోళనకు దిగింది. అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని నినదించింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు సీబీఐకి కేసును అప్పగించాలన్నారు బీఎస్పీ నేతలు. జి.మామిడాడలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు మోహరించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పోలీస్ పికెట్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పోలీసులను చూస్తుంటే ఏదో జరిగిపోతుందన్న ఆందోళన కలుగుతుందన్నారు.

ఇక.. సుబ్రహ్మణ్యంది పక్కగా హత్యేనని తేలింది. సుబ్రమణ్యం ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టడంతోనే ఆయన మృతి చెందాడని పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. అలాగే.. సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు ఉన్నట్టు నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలి బొటనవేలు, తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు.