కోవిడ్ పై పోరులో సహకరిస్తాం, ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లేఖ , ‘సానుభూతి వెల్లువ’
కోవిద్ పై భారత్ జరుపుతున్న పోరులో తాము సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సానుభూతి పూర్వకంగా రాసిన ఈ లేఖలో ఆయన..
కోవిద్ పై భారత్ జరుపుతున్న పోరులో తాము సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సానుభూతి పూర్వకంగా రాసిన ఈ లేఖలో ఆయన.. మీ దేశంలో కోవిడ్ పరిస్థితి పట్ల తామెంతో విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం, మా ప్రజల పట్ల, నా పేరిట కూడా సింపతీ తెలుపుతున్నానన్నారు. ఈ సమయంలో ఇండియాకు చైనా అధికారపూర్వకంగా సాయానికి ముందుకు రావడం ఇదే మొదటిసారి.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ కూడా ఇండియాలోని ఈ పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విదేశ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్. జైశంకర్ కు రాసిన లేఖలో.. తమ దేశంలో తయారైన యాంటీ పాండమిక్ మెటీరియల్స్ అతి త్వరలో ఇండియాకు చేరుతాయని తెలిపారు. మీ దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను తాము పరిశీలిస్తున్నామని అన్నారు. మీకు అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాంగ్ పేర్కొన్నారు.
కోవిడ్ మానవాళి కి ఉమ్మడి శత్రువని, దీనినెదుర్కొనేందుకు అన్ని దేశాలూ ముందుకు రావాలని ఆయన కోరారు. మీకు అవసరమైన సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటామన్నారు. అయితే ఇండియాలో ఈ మహమ్మారి పరిస్థితిని అలుసుగా తీసుకుని చైనా మళ్ళీ లడాఖ్ తూర్పు ప్రాంతంలో తిరిగి మెల్లగా తన దళాలను మోహరించడానికి యత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఉభయ దేశాల సేనల ఉపసంహరణ జరిగినప్పటికీ నియంత్రం రేఖ వద్ద పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులా ఉందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.చైనా తన ట్యాంకర్లను, ఇతర శకటాలను క్రమంగా ఇక్కడికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భారత దళాలు అప్రమత్తంగా ఉంటూనే చైనా సేనల కదలికలపై నిఘా పెట్టాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Samsung Galaxy Book Flex 2 Alpha: శామ్‌సంగ్ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్
Vaccination: ప్రయివేట్ ఆసుపత్రుల నుంచి వ్యాక్సిన్ వెనక్కి తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం