China Apps: భారత్ దెబ్బకు దిగొచ్చిన చైనా.. 54 యాప్స్ నిషేధంపై తెగ ఆందోళన..
భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించడంపై డ్రాగన్ దేశం గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడిదారులందరినీ భారతదేశం ఆదుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
India Banned 54 China Apps: దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకే వాటిని నిషేధించినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరిణామంపై చైనా స్పందించింది. భారత ప్రభుత్వం(Indian Government) తీసుకున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా కారణాలతో చైనా(China) దేశంతో సంబంధమున్న 54 యాప్‌లను భారత్ నిషేధించడంపై చైనా గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందించింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరినీ పారదర్శకంగా, న్యాయంగా, వివక్షత చూపకుండా భారత్ ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈమేరకు ఓ ప్రకటన చేసింది. ఇందులో ‘ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సహకారం మంచి అభివృద్ధి వేగాన్ని కొనసాగించడానికి భారతదేశం ఖచ్చితమైన చర్యలు తీసుకోగలదని మేం ఆశిస్తున్నాం” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ పేర్కొన్నారు.
ఈ 54 యాప్‌లను నిషేధించిన సమయంలో.. ‘భారత యూజర్ల నుంచి విలువైన సమాచారాన్ని ఆ యాప్స్ సేకరిస్తున్నాయి. ఈ సున్నితమైన సమాచారాన్ని చైనా సర్వర్లకు బదిలీ చేస్తున్నాయి. డేటా చౌర్యానికి పాల్పడి, దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని’ కేంద్ర హోం శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Also Read: Sydney Beache: స్విమ్మర్‌పై షార్క్ ఎటాక్.. 60 ఏళ్ల తర్వాత దారుణ ఘటన.. పలు బీచ్‌లు మూసివేత
American Woman: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్ సెల్స్‌తో.. ఎయిడ్స్ పూర్తిగా నయం..