Sydney Beach: స్విమ్మర్‌పై షార్క్‌ ఎటాక్‌.. 60 ఏళ్ల తర్వాత దారుణ ఘటన.. పలు బీచ్‌లు మూసివేత

Sydney beache: బీచ్‌( beache)లో స్విమ్మింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిపై షార్క్‌ చేప(Shark Fish) దాడి చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఈ దారుణ ఘటనలో స్విమ్మర్‌ మృతి చెందాడు.  ఈ దారుణ సంఘటన అనంతరం..

Sydney Beach: స్విమ్మర్‌పై షార్క్‌ ఎటాక్‌.. 60 ఏళ్ల తర్వాత దారుణ ఘటన.. పలు బీచ్‌లు మూసివేత
Sydney Beaches Closed
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 18, 2022 | 6:59 AM

Sydney Beach: బీచ్‌( beach)లో స్విమ్మింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిపై షార్క్‌ చేప(Shark Fish) దాడి చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఈ దారుణ ఘటనలో స్విమ్మర్‌ మృతి చెందాడు.  ఈ దారుణ సంఘటన అనంతరం సిడ్నీలోని ఐకానిక్ బోండి ,  బ్రోంటే బీచ్  సహా అనేక బీచ్‌లను గురువారం మూసివేశారు. దాదాపు 60 ఏళ్లలో నగరంలోని బీచ్‌లలో ఇటువంటి మరణం సంభవించిందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

సిడ్నీలో ఫేమస్ బీచ్ లో ఈ దారుణ ఘటన ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. కాగా మృతుని వివరాలు తెలియరాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. సిడ్నీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లిటిల్ బే బీచ్’ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో సిడ్నీలోని పలు బీచ్ లను మూసివేశారు. 1963 తర్వాత ఒక షార్క్ చేప దాడిలో వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి అని అక్కడి అధికారులు తెలిపారు. షార్క్ చేపను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దాడి జరిగిన బీచ్ ప్రాంతంలో డ్రమ్ లైన్లను ఏర్పాటు చేయడంతోపాటు షార్క్ చేప ఎక్కడ ఉన్నదీ గుర్తించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. తెల్లటి రంగులో, 9.8 అడుగుల పొడవుతో ఉన్న షార్క్ ఆ వ్యక్తిపై దాడి చేసినట్టు న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి తెలిపారు. దాడి జరిగిన బీచ్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Also Read:  వారు సర్వనాశనమై పోతారు.. మంచు మోహన్ బాబు శాపనార్థాలు

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే