XI Jinping: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షులు జిన్ జిన్‌పింగ్
తమ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియనివ్వని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు.
Chinese President Xi Jinping: ప్రపంచాన్ని ఏలాలన్న కల, అన్ని దేశాలతో ఆర్థిక సంబంధాలు నెలకోల్పుకున్నాడు. జీవిత కాలం అధ్యక్షుడిగా తనను తానే ప్రకటించుకున్నాడు. తన దేశంలో ఆయన మాటే శాసనం సర్వం ఆయన కనుసన్నల్లోనే నడవాల్సిందే. ఆయన ఆగ్రహానికి గురైతే అతి పెద్ద ధనవంతుడైనా కనిపించకుండా పోతాడు. తమ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియనివ్వని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. రెండేళ్లుగా ఆయన కనిపించకపోవడంతో అది నిజమేనని కథనాలు వెలువడుతున్నాయి. గతేడాది చివర్లో ఆసుపత్రి పాలైన జి సెరిబ్రల్ అనైరిజమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు కథనాలు వెలువుడుతున్నాయి.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రమాదకరమైన మెదడు వ్యాధితో బాధపడుతున్నారు. వాస్తవానికి, జి జిన్‌పింగ్ ప్రస్తుతం సెరిబ్రల్ అనూరిజం అనే తీవ్రమైన మెదడు వ్యాధితో బాధపడుతున్నారనివైద్యులు గుర్తించారని తాజాగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారని, అయితే జిన్‌పింగ్ మాత్రం చైనా సంప్రదాయ ఔషధాలతోనే చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు.
అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గత కొన్ని నెలలుగా దీనితో బాధపడుతున్నారు. ఈ కారణంగా, అతను డిసెంబర్ 2021 లో ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. జి జిన్‌పింగ్ అనారోగ్య వార్త చాలాసార్లు తెరపైకి వచ్చింది. ఆయన ఆరోగ్యంపై ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ సమయంలో ఏ విదేశీ నేతలతోనూ కలవడానికి అధ్యక్షుడు నిరాకరించడంతో ఊహాగానాలు తీవ్రమయ్యాయి.
అంతకుముందు మార్చి 2019లో, జి జిన్‌పింగ్ ఇటలీ పర్యటన సందర్భంగా, అతను నడవడానికి ఇబ్బంది పడ్డాడు. అతని నడక అసాధారణంగా కనిపించింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో అదే పర్యటనలో జిన్‌పింగ్ నడవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో అతను కూర్చోవడానికి ఇతరుల మద్దతు తీసుకోవల్సి వచ్చింది. ఇది కాకుండా, 2020 సంవత్సరంలో, షెన్‌జెన్‌లో ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు అతను దగ్గుతో కనిపించాడు. అదే ర్యాలీలో తక్కువ స్వరంతో ప్రసంగిస్తూ, ఆ రోజు ఆలస్యంగా వేదికపైకి చేరుకున్నారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారనడానికి ఇవే కారణాలుగా చెప్పవచ్చుని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడింది.
సెరిబ్రల్ లేదా బ్రెయిన్ అనూరిజం అంటే ఏమిటి
మెదడులోని రక్తనాళం ఒకవైపు నుంచి బెలూన్ లాగా ఉబ్బిపోయేలా బలహీనపడటాన్ని సెరిబ్రల్ లేదా బ్రెయిన్ అనూరిజం అంటారు. ఈ వ్యాధి మెదడులోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్న వ్యక్తికి కూడా రావచ్చు. అమునం 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, జన్యుపరంగా బలహీనమైన నరాలు, ఇన్ఫెక్షన్, గాయం, మెదడు దెబ్బతినడం లేదా కణితులు ఉన్నవారు ఈ వ్యాధికి ఎక్కువ అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.